అక్టోబర్ 9 కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేయాలి.
జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్.
ఈ నెల 9న హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అందజేసే నియామక పత్రాల కార్యక్రమానికి వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సంబంధిత అధికారులకు సూచించారు.
సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఈనెల 9వ తేదీన ఎల్.బి స్టేడియంలో జరిగే నూతనంగా ఎంపికైన ఉపాద్యాయుల నియామక పత్రాలను అందజేసే కార్యక్రమం పై జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్ తో కలిసి, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో డి.ఎస్సీ. నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన 376 మంది నూతన ఉపాధ్యాయులకు ఈనెల 9న నియామక పత్రాలను అందజేయడం జరుగుతుందని అందుకు అభ్యర్థులు ఒకరోజు ముందస్తుగా జిల్లా హెడ్ క్వార్టర్ కి వచ్చే విధంగా చూడాలని, వారికి అవసరమైన వసతి ఏర్పాట్లను చేయాలని, అభ్యర్థులను హైదరాబాదు ఎల్.బి స్టేడియంకు చేరవేయడానికి 8 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడంతో పాటు అల్పాహారం, భోజన సదుపాయాలు ఏర్పాటు చేయాలని ప్రతి బస్సులో ఒక పోలీస్,రెవెన్యు, మెడికల్ సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకోవాలని, పర్యవేక్షణకై లైజన్ అధికారులను నియమించాలన్నారు. జిల్లా నుండి బయలుదేరిన బస్సుల యొక్క ట్రాకింగ్ ప్రక్రియ మొత్తాన్ని చూసుకోవాల్సిందిగా ఈ.డీస్ట్రిక్ మేనేజర్ కు సూచించారు.
ఈ సమీక్షలో అదనపు ఎస్పీ చెన్నయ్య, జెడ్.పి.సీ.ఈ.ఓ నర్మద,డి.పి.ఓ హరిప్రసాద్,ట్రైబల్ వేల్ఫేర్ అధికారి సైదా, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మురళీధర్, జిల్లా విద్యాధికారి రాజేశ్వరరావు, మహబూబాబాద్ తహసీల్దార్ భగవాన్ రెడ్డి, ఈ.డిస్ట్రిక్ట్ మేనేజర్ ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.
సమాచార పౌరసంబంధాల శాఖ, జిల్లా అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీచేయనైనది.