ఫాతిమా పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవం వేడుకలు

తిరుమలగిరి 23 ఫిబ్రవరి 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని ఫాతిమా పాఠశాలలో అంగరంగ వైభవంగా వార్షికోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మందుల సూర్యకిరణ్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు విద్యార్థులు నైతిక విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని విద్యార్థులు కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు విద్యార్థులు నిర్వహించిన సంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ సిహెచ్ బాలరాజు ప్రిన్సిపాల్టీ రాము కార్యదర్శి శివరాణి ఏవో సిహెచ్ ఆంటోనీ మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ చాగంటి అనసూయ రాములు కందుకూరి అంబేద్కర్ విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు