ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాల భర్తీ వాయిదా

ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఖాళీగా ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాల భర్తీ కొసం అర్హులైన అభ్యర్థుల నుండి డేటా ఎంట్రీ ఆపరేటర్ -11, ఆఫీసు సబార్డి నేట్ -09, ల్యాబ్ అటెండెంట్ -03, థియేటర్ అసిస్టెంట్ - 01 మొత్తం 24 పోస్టులకు సంభందించి దరఖాస్తులను స్వీకరించడం జరిగింది. దరఖాస్తు చేసుకున్న అర్హుల తొలి జాబితా వివరాల ప్రకారం డేటా ఎంట్రీ ఆపరేటర్-694, ఆఫీసు సబార్డినేట్ - 1533, ల్యాబ్ అటెండెంట్ -204, థియేటర్ అసిస్టెంట్ -04 దరఖాస్తులు స్వీకరించినట్లు సంభందించిన వివరాలు ఇదివరకే విడుదల చేయడం జరిగిందని జిల్లా సెలక్షన్ కమిటీ అధ్యక్షులు జిల్లా కలెక్టర్ బి. యం. సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈనెల 2వ తేదీన నిర్వహించాల్సిన ఎంపిక ప్రక్రియ అనివార్య కారణాలవల్ల ఆలస్యం అవుతున్నందున, తుది జాబితా విడుదల, లాటరీ ప్రక్రియ నిర్వహించే తేదీని తదుపరి తెలియపరచడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో వివిధ పోస్టుల నిమిత్తం దరఖాస్తులు చేసుకున్న నిరుద్యోగులు ఇట్టి విషయాన్ని గమనించగలరని తెలిపారు...