బీసీ ఉపాధ్యాయులంతా ఏకమై పూల రవిందర్ ను ఎమ్మెల్సీ గా గెలిపించాలి

Feb 23, 2025 - 00:05
Feb 23, 2025 - 00:07
 0  9
బీసీ ఉపాధ్యాయులంతా ఏకమై పూల రవిందర్ ను ఎమ్మెల్సీ గా గెలిపించాలి

రిటైర్డ్ ఐఎఎస్, బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం అధ్యక్షులు చిరంజీవులు

ఎన్నో ఏళ్ళుగా బీసీలు అగ్ర వర్ణాల జెండాలు అజెండాలు మోసేవారుగా ఉన్నారని బీసీల ఓటు బీసీలకు వేసి గెలిపించడం వల్ల అది

బీసీల అభివృద్ధికి తోడ్పడుతుందని రిటైర్డ్ ఐఎఎస్, బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం అద్యక్షులు టి.చిరంజీవులు అన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మాజీ ఎమ్మెల్సీ పూల రవిందర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతూ శనివారం స్థానిక జీవివి ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలను చైతన్యం చేసి రాజ్యాధికారం సాధించేందుకు బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం ఏర్పడిందన్నారు. తమ ఫోరం ఆధ్వర్యంలో సమాజంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాలను వివరిస్తూ బీసీలను చైతన్యం చేయడం జరుగుతందన్నారు. అలాగే కుల గణన కోసం పోరాడడంతో పాటు బీసీ జనాభాను తగ్గించడంతో రీ సర్వే కోసం పోరాడి విజయం సాధించామన్నారు. రిజర్వేషన్లు లేక బీసీలు అన్ని రంగాల్లో నష్టపోతున్నారని బీసీలకు కేటాయించే బడ్జెట్ చాయ్ కోసం కేటియించే బిల్లు కంటే తక్కువ అన్నారు. బీసీలు రాజ్యాధికారం చేపట్టాలని బీసీల గెలుపు రాష్ట్రాన్ని మలుపు తిప్పుతుందన్నారు. బీసీలుగా ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నారని పూల రవిందర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేయడంతో పాటు ఇతర ప్రాధాన్యత ఓట్లను కూడా బీసీ అభ్యర్థులకే వేయాలని ఉపాధ్యాయులను కోరారు. మేధావులైన ఉపాధ్యాయులు తమ ఓటును సక్రమంగా వినియోగించుకోవాలను నిరంతరం ఉపాధ్యాయ సమస్యల కోసం పోరాడుతూ గతంలో ఎమ్మెల్సీగా పనిచేసే ప్రభుత్వముతో పోరాడి ఉపాధ్యాయులకు మెరుగైన పిఆర్సి సాధించడంతోపాటు అనేక రకాల సమస్యలను పరిష్కరించిన పూల రవీందర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ధశరథరామారావు, గాలి మురళి, భూతం యాకమల్లు, మట్టపల్లి రాధాకృష్ణ తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333