పెద్దగట్టు జాతర వద్ద భద్రత పరిశీలించి అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించిన ఎస్పీ సన్ ప్రీత్ సింగ్
సూర్యాపేట..19 ఫిబ్రవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:. పెద్దగట్టు జాతర వద్ద భద్రత పరిశీలించి అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించిన ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ విలువైన వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోవాలని భక్తులు కోరారు. దొంగతనాలు, ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైన ముందస్తు చర్యలు తీసుకున్నామని అన్నారు. కరెంట్ పోల్స్, కరెంట్ వైర్స్ పట్టుకోవద్దు అని కోరారు. ఎగ్జిబిషన్ నందు పిల్లలను పట్టుకొని తిరగాలి అజాగ్రత్తగా ఉండవద్దు అని అన్నారు. భక్తుల అవసరాల దృష్ట్యా ఎక్కడికక్కడ బారికెడ్స్ ఏర్పాటు చేశాము వాటిని దాటుకుంటూ, దూకుకుంటూ వెళ్ళవద్దు పోలీసు వారి సూచనలు పాటిస్తూ సంతోషకర వాతావరణంలో దైవదర్శనం చేసుకుని జాగ్రత్తగా వెళ్ళాలి అని కోరారు.
జాతర సరళి, వాహనాల రద్దీ, భక్తుల రాకపోకలు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఎస్పీ గారి వెంట AR అదనపు ఎస్పీ జనార్ధన్ రెడ్డి, DSP రవి, CI రాజశేఖర్, సిబ్బంది ఉన్నారు.