తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలకు విలువ లేదా....?
అవినీతి మత్తులో మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు
అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో అక్రమ ఇసుక రవాణా
జోగులాంబ గద్వాల 22 ఫిబ్రవరి 2025 తెలంగాణవార్త ప్రతినిధి:- మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో మళ్లీ మొదలైన అక్రమ ఇసుక మాఫీయా స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్రమ ఇసుక రవాణా అడ్డుకట్ట వేయాలని అక్రమ ఇసుక రవాణా పై ఉక్కు పాదం మోపాలని జిల్లా కలెక్టర్ కి, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. అయినా సరే మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో అక్రమ ఇసుక దందా కొనసాగుతూనే ఉంది. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయలేరా.....? మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో మైనింగ్ శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు...? అని గ్రామంలోని ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.