సూర్యాపేట మున్సిపల్ కార్యాలయంలో రివ్యూ సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

Feb 22, 2025 - 08:12
 0  1
సూర్యాపేట మున్సిపల్ కార్యాలయంలో రివ్యూ సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

సూర్యాపేట పట్టణంలోని ప్రజలకి రానున్న వేసవి కాలంలో త్రాగునీటి సరఫరాలో ఎలాంటి  ఇబ్బందులు రాకుండా తగు చర్యలు తీసుకొని నీటిసరపరా సక్రమంగా సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి అని జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్ అన్నారు ,శుక్రవారం రోజున మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ,మిషన్ భగీరథ (గ్రిడ్),ఇంట్రా , పబ్లిక్ హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారులు మరియు 48 వార్డు ల నీటిసరఫరా లైన్ మెన్ లతో రివ్యూ సమావేశం నిర్వహించి పట్టణంలో  glsr ,elsr  ట్యాన్క్ ల వారీగా జరుగు చున్న పంపింగ్ వివరాలను రా వాటర్ పంపింగ్ వివరాలను వార్డుల వారీగా వున్న నీటిసమస్యలను లైన్ మెన్ లను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా లైన్ మెన్లు తమవార్డ్ లలో వున్న నీటి సమస్యలు జంక్షన్లు కలిపి నీరు ప్రెషర్ ఇవ్వాలి అని,పాత పైపు లైన్ల స్థానంలో కొత్త పైపులైన్లు వేయాలి అని, లీకేజీలు రిపేరు చేయించాలి అని విలీన గ్రామాలలో మిషన్ భగీరథ నీరు సరపరా చేయు ప్రాంతాలలో గ్రిడ్ వారు నిర్మాణం  చేసిన వాటర్ ట్యాన్క్లు నిరుపయోగంగా వున్నాయి అని లోప్రెషర్ వల్ల నీరు ట్యాన్క్ లకు ఎక్కడం లేదని తెలిపారు.. పట్టణంలో ప్రజలు తమ ఇండ్లలో నల్లాలకు నేరుగామోటార్లు పెట్టటం వల్ల కొన్ని గృహాలకు నీరు సరఫరా కావడం లేదని తెలిపారు..అనంతరం కలెక్టర్ గారు మాట్లాడుతూ మిషన్ భగీరథ , మున్సిపల్ ఇంజనీర్లు కో ఆర్డినేషన్ తో 20 రోజులలో లోగా ప్రాబ్లమ్స్ క్లియర్ చేయాలి, జంక్షన్లు కలపాలిఅని అధికారులని ఆదేశించారు.ప్రతి 15 రోజులకొక సారి వాటర్ టెస్టింగ్ చేయించి రిపోర్ట్ సమర్పించాలి అన్నారు,త్రాగునీటి సరఫరాలో మురుగు నీరు కలవకుండా చూడాలి అని మరియు వాటర్ ట్యాన్క్ లను శుభ్రపరచాలి అని అన్నారు.వాటర్ లైన్ మెన్ లు డ్రెస్ కోడ్,అమలు చేయాలి అన్నారు..ఈకార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ బి.శ్రీనివాస్ ,పబ్లిక్ హెల్త్ ఇఇ గిలకత్తుల సత్యనారాయణ,ఇంట్రా ఇఇ కరుణాకర్ రెడ్డి,గ్రిడ్ ఇఇ శ్రీనివాసరావు, మున్సిపల్ ఇఇ యం.కిరణ్ ,డి.ఈ లు సత్యారావు,ఏ ఇ లు తిరుమలయ్య ,నరేందర్,రాజిరెడ్డి,ఆర్వోకళ్యాణి ,యండి .గౌసుద్దీన్ ,ఎస్ .ఎస్ .ఆర్ ప్రసాద్ ,సయ్యద్ సమ్మి, వేణు  తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333