అడ్వకేట్ అల్లె రాము ను  సన్మానించిన ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్

Feb 17, 2025 - 20:19
 0  2
అడ్వకేట్ అల్లె రాము ను  సన్మానించిన ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్
అడ్వకేట్ అల్లె రాము ను  సన్మానించిన ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్
అడ్వకేట్ అల్లె రాము ను  సన్మానించిన ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్

 జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ కేంద్రంలో సీనియర్ జర్నలిస్ట్ అల్లె రాము బార్ అసోసియేషన్ లో సభ్యత్వం పొంది కోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో సోమవారం ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అడ్వకేట్ అల్లె రాము ను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు టైగర్ అలీ నవాబ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు దారిశెట్టి రాజేష్, చీటి వెంకట్రావు, ఫహీం,పీర్ల సత్యం,బట్టు సునీల్, ముజాఫర్ అహ్మద్ (సజ్జు), వనతడుపుల అంజయ్య,మోసిన్, అతిక్, చిత్తరి ఆనంద్, ప్రభు తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్ జన్మదిన వేడుకలు

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా సోమవారం కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే  క్యాంపు ఆఫీస్ లో రక్తదాన శిబిరం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, పలువురు నాయకులు, యువకులు  రక్తదానం చేశారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు దారిశెట్టి రాజేష్,చీటి వెంకట్రావ్, ఫయీం,మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333