ఖబర్దార్ కెసిఆర్, జగదీష్ నోరు అదుపులో పెట్టుకో

పిఎసిఎస్ చైర్మన్ జడ రాములు యాదవ్

Feb 22, 2025 - 18:21
Feb 22, 2025 - 18:22
 0  5
ఖబర్దార్ కెసిఆర్, జగదీష్ నోరు అదుపులో పెట్టుకో

తెలంగాణ వార్త మాడుగుల పల్లి ఫిబ్రవరి22 :-మాడుగులపల్లి మండల పరిధిలోని ఇసుకబావి గూడెం గ్రామంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నల్లగొండ పార్లమెంట్ అడక్ కమిటీ సభ్యులు వేములపల్లి పి ఎస్ సి ఎస్ చైర్మన్ జడ రాములు యాదవ్, శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ప్రదాత తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పై బిఆర్ఎస్ నాయకులు కేసీఆర్ జగదీశ్వర్ రెడ్డి స్థాయికి మించి విమర్శించడం తగదు అన్నారు.అదేవిధంగా జగన్తో అంటగాగి ఈరోజు తెలుగుదేశం పార్టీని అధినాయకుని చూసి రాజకీయంగా భయపడుతూ విమర్శించడం సిగ్గుచేటు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ తెలంగాణ కార్యకర్తలే ప్రధాన భూమిక పోషిస్తారు.ఈరోజు బిఆర్ఎస్ పార్టీ తన అస్తిత్వాన్ని కోల్పోతూ తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణకు భయపడుతూ చంద్రబాబు నాయుడు పై అనుచిత వ్యాఖ్యలు చేయడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం ఇప్పటికైనా బిఆర్ఎస్ నాయకులు తెలుగుదేశం పార్టీని అధినాయకుని విమర్శించడం మానుకుంటే వారి మనుగడ కూడా ప్రశ్నార్థకం కాకుండా ఉంటుంది లేకపోతే భవిష్యత్తులో కూడా గత ఎన్నికల్లో ఏదైతే ఫలితాలు వచ్చాయో మళ్లీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికొస్తే అవే ఫలితాలు పునరావృతం అవుతాయని హెచ్చరించారు. కెసిఆర్ తన కుటుంబ రాజకీయాలను సరిదిద్దుకోలేక చంద్రబాబు నాయుడు, పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సాగర్ నీటి జలాల పైన గతంలో జగన్మోహన్ రెడ్డి ,వైయస్ రాజశేఖర్ రెడ్డి, లకు చెంచాగిరి చేసిన మాట వాస్తవం కాదా కృష్ణా జిల్లాలో గోదావరి జిల్లాలను తెలంగాణ ప్రజలకు అందించకుండా స్వార్థ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రజల ఆర్థిక వెనుకబాటు తనానికి కారణం కేసీఆర్ ఈరోజు తెలంగాణలో 10 సంవత్సరాల పరిపాలించిన తర్వాత కూడా సెంటిమెంట్ ని రెచ్చగొడుతూ భారతదేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేయడం శాసనసభ్యుడుగా కూడా కెసిఆర్ పనికిరాడు నిజంగా ప్రజల పట్ల మమకారం ఉంటే ఈరోజు జగదీశ్ రెడ్డి కేసీఆర్ లు రాజీనామా చేసి మళ్లీ ప్రజల్లోకి వెళ్ళవలసిందిగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ తెలుగుదేశం మాడుగులపల్లి మండల పార్టీ అధ్యక్షులు షేక్ రసూల్,మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కట్టా అనంతరెడ్డి ,తదితరులు పాల్గొన్నారు..

Vallapudasu Kiran Miryalaguda Reporter Nalgonda Dist Telangana State