సైబర్ నేరగాడు కృష్ణ యాదవ్ ను అరెస్ట్ చేసిన మల్లాపూర్ పోలీసులు

2023 సంవత్సరము మే నెలలో మల్లాపూర్ మండలం లోని ముత్యంపేట గ్రామానికి చెందిన విద్యార్థి మామిడాల నితీష్ కుమార్ అనునతడు ఉన్నత చదువుల కొరకు లండన్ లోని యూనివర్సిటీలో సీటు గురించి ప్రయత్నం చేయుచుండగా టెలిగ్రామ్ యాప్ సెల్ ఫోన్ లో లండన్ లో ఉన్న ఒక వ్యక్తి తనకు తానుగా షణ్ముఖ కృష్ణ యాదవ్ అను వ్యక్తి తనది తిరుపతి నివాసం అని ఫోన్లో పరిచయం చేసుకొని నితీష్ కుమార్ తో ఏర్పడకుండా తాను లండన్ లో చదివి, ఉద్యోగం చేస్తున్నానని చెప్పి మాయమాటలతో నితీష్ కుమార్ ని మోసపూరితంగా నమ్మించి నువ్వు ఇక్కడికి వచ్చి ఇండియా డబ్బులతో ఫీజు కడితే ఎక్కువ ఖర్చు అవుతుందని నేను నా యొక్క బ్యాంక్ అకౌంట్ తిరుపతిలో ఉన్నదని (బ్యాంక్ ఆఫ్ ఇండియా తిరుపతి టౌన్) అని వ్రాసి ఉన్న బ్యాంకు పాస్ బుక్ వాట్సప్ లో పెట్టి అట్టి దాంట్లో నీవు డబ్బులు వేస్తే, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను లండన్ కరెన్సీ తో యూనివర్సిటీ డబ్బులు కడతానని చెప్పగా మరియు కృష్ణా యాదవ్ యొక్క పాస్ పోర్ట్ కూడా వాట్సాప్ లో పెట్టగా, నితీష్ కుమార్ నమ్మి తన తల్లిదండ్రులకు చెప్పి, డబ్బులు అప్పు తీసుకొని వచ్చి కృష్ణ యాదవ్ యొక్క తిరుపతి లో ఉన్న బ్యాంక్ ఎకౌంటు కి ముత్యంపేట గ్రామంలో ఉన్న ఇండియన్ బ్యాంకు నుండి నితీష్ కుమార్ తల్లి మామిడాల లత తన అకౌంట్లో నుండి 5,75,000/- ఐదు లక్షల డెబ్బై అయిదు వేల రూపాయలు ఒకసారి, నితీష్ కుమార్ అకౌంట్ నుండి 25,000/- ఒకసారి ఇలా మొత్తం 6,00,000/- ఆరు లక్ష రూపాయలు పంపించినారు. తర్వాత నితీష్ కుమార్ లండన్ లో ఉన్న కృష్ణ యాదవ్ ని నాకు సీట్ కు డబ్బులు కట్టినట్లు రసీదు పంపుతానని చెప్పావు ఇంతవరకు పంపలేదు అని అడగగా, అతడు పంపుతానని కొన్ని రోజులు చెప్పి, తర్వాత సెల్ ఫోన్ ఆఫ్ చేసినాడు. ఎన్నిసార్లు ప్రయత్నించినా మాట్లాడనందున మోసం చేసినట్లు గ్రహించి మల్లాపూర్ పోలీస్ స్టేషన్లో దరఖాస్తు అప్పటి SI గారు 27-05-2023 రోజున కేసు నమోదు చేసి కృష్ణ యాదవ్ పై కోర్టు నుండి పర్మిషన్ తీసుకుని జిల్లా ఎస్పీ గారి ద్వారా LOC పంపించినారు. తర్వాత కొద్ది రోజులకు నితీష్ కుమార్ తల్లిదండ్రులు డబ్బులు జమ చేసి ఇవ్వగా లండన్ వెళ్లిపోయి చదువుకుంటూ, అక్కడ కూడా కృష్ణ యాదవ్ గురించి వెతకగా ఎక్కడ దొరకలేదు.
నిన్న తేదీ 20-02-2025 రోజు ఉదయం కృష్ణ యాదవ్ లండన్ నుండి ఫ్లైట్లో హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కి రాగా ఎయిర్ పోర్ట్ లో కృష్ణ యాదవ్ ని గుర్తించి పట్టుకొని ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ వారు సిఐ నిరంజన్ రెడ్డి మెట్ పల్లి కి తెలుపగా, CI గారు వెంటనే హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కి మల్లాపూర్ ఎస్సై రాజుని పంపగా సాయంత్రం నాలుగు గంటలకు ఎయిర్ పోర్ట్ లో ఇమిగ్రేషన్ వారి అనుమతితో కృష్ణ యాదవ్ ని అదుపులోనికి తీసుకొని మెట్ పల్లి కి రాగా CI గారు అతనిని పూర్తిగా విచారించగా, తాను ఆరు లక్షల రూపాయలు నితీష్ కుమార్ ని మోసపూరితంగా నమ్మించి తన అకౌంట్లో డబ్బులు వేయించుకొని అట్టి డబ్బులు మా తండ్రిగారైన జయరామయ్య ద్వారా నేను లండన్ కు తెప్పించుకొని వాడుకున్నాను. మా తండ్రి కూడా ఇట్టి నేరంలో సహకరించినాడని తన నేరమును ఒప్పుకొనగా అతనిని వివిధ సెక్షన్ల ప్రకారం శిక్షించాలని కోర్టుకు తరలించి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరుచుతున్నాము.
ఇట్టి సమావేశంలో CI నిరంజన్ రెడ్డితో పాటు ఎస్సై రాజులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఇకనుండి ఎవరైనా సైబర్ నేరాలకు పాల్పడి అమాయకులను మోసం చేసి డబ్బులు తీసుకున్నట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని మరియు సైబర్ నేరాల పట్ల ప్రజలు, విద్యార్థులు, యువకులు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా ఫోన్ లు చేసి ఏదైనా మోసపూరిత విషయాలు చెప్పి నమ్మించినట్లయితే ప్రజలు గమనించి ఎవరికీ OTP లు గాని చెప్పకూడదని, ఏ అనుమానం ఉన్న వెంటనే 1930 కి ఫోన్ చేయాలని లేదా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని సిఐ నిరంజన్ రెడ్డి ప్రజలకు సూచించాడు