క్రీస్తు మార్గంలో పయనించాలి

సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్అధ్యక్షులు పంతంగి వీరాస్వామి గౌడ్ (సూర్యాపేట, డిసెంబర్ 25) ప్రతి ఒక్కరు సమాజంలో శాంతి, ప్రేమ, కరుణ స్థాపన కు ప్రభువైన ఏసుక్రీస్తు మార్గంలో పయనించాలని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రoలో ఆ యూనియన్ పట్టణ అధ్యక్షులు జలగం సత్యం గౌడ్ నివాసం లో జరిగిన క్రిస్మస్ వేడుకలకు హాజరై జలగం సత్యం గౌడ్ కు సాల్వతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్టింగ్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడా రు. క్రీస్తు మార్గాన్ని అనుసరించేదుoకు ప్రపంచంలో ఎన్నో దేశాల్లో ప్రజలు క్రిస్మస్ వేడుకలు జరుపుతున్నారని వివరించారు. ప్రతి ఒక్కరు క్రీస్తు ను ఆదర్శం గా తీసుకొని ఆకలితో ఉన్నా పేదల ఆకలి తీర్చేలా ప్రేమ కరుణ తో సేవ కార్యక్రమాలు చేయాలనీ సూచించారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగల సత్యం గౌడ్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత కిషన్ నాయక్ జిల్లా జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాసరెడ్డి జిల్లా కోశాధికారి పాల సైదులు పట్టణ గౌరవ సలహాదారుడు మాది రెడ్డి గోపాల్ రెడ్డి పట్టణ ఉపాధ్యక్షుడు కడారి అంజయ్య గౌడ్ పట్టణ కార్యదర్శి పట్టేటి కిరణ్ ఆకుల మారయ్య గౌడ్ ఐతగాని మల్లయ్య గౌడ్ జిల్లా కార్యదర్శి మండాది గోవర్ధన్ గౌడ్ బుర్ర శ్రీనివాస్ గౌడ్ బుర్ర సరస్వతి జలగం రజిని జలగం స్రవంతి జలగం రమేష్ జలగం కిరణ్ గుణగంటి శారద రాపర్తి జానయ్య దండి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు