భారతరత్న సెయింట్ మదర్ తెరిసా సేవలు చిరస్మరణీయం:

Aug 26, 2024 - 12:38
Aug 26, 2024 - 13:26
 0  39
భారతరత్న సెయింట్ మదర్ తెరిసా సేవలు చిరస్మరణీయం:

భారతరత్న సేయింట్ మాథర్ తెరిస్సా సేవలు చిరస్మరణీయం

పెన్ పహాడ్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు

సూర్యాపేట రూరల్ సి. ఐ. వై.సురేందర్ రెడ్డి చేతుల మీదుగా రోగులకు పండ్ల పంపిణి చేశారు*

బిషప్ దుర్గం ప్రభాకర్ ఉమ్మడి నల్గొండ జిల్లా (ఏ.ఐ. ఎఫ్.యం. టి.యస్. ఓ ) అధ్యక్షులు 

సోమవారం 26 ఆగస్టు :పెన్ పహాడ్ మండల కేంద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు మథర్ థెరిస్సా 114 వ జన్మదిన వేడుక సందర్బంగా *"ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ మథర్ థెరిస్సా సోషల్ ఆర్గనైజెషన్" నల్గొండ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బిషప్ దుర్గం ప్రభాకర్ ఆధ్వర్యంలో సూర్యాపేట రూరల్ సి. ఐ.వై.సురేందర్ రెడ్డి, డాక్టర్ కె. శ్రవంతి, పెన్ పహాడ్ యస్. ఐ. పెఱిక రవీందర్ చేతుల మీదుగా రోగులకు పండ్ల పంపిణి చేశారు.

 ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మథర్ తెరిస్సా సేవలు చిరస్మరణీయం అనీ సమాజంలో ఆమె సేవా ప్రపంచంనీకే ఆదర్శం అనీ అన్నారు.ఈ సందర్బంగా బిషప్ దుర్గం ప్రభాకర్ మాట్లాడుతూ మదర్ థెరీసా (ఆగష్టు 26, 1910 - సెప్టెంబర్ 5, 1997), ఆగ్నీస్ గోక్షా బొజక్షు గా జన్మించిన అల్బేనియా దేశానికి చెందిన రోమన్ కాథలిక్ సన్యాసి. భారతదేశ పౌరసత్వం పొంది మిషనరీస్ ఆఫ్ ఛారిటీని భారతదేశంలోని కోల్కతా (కలకత్తా) లో, 1950 లో స్థాపించింది. 45 సంవత్సరాల పాటు మిషనరీస్ ఆఫ్ ఛారిటీని భారత దేశంలో, ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ, పేదలకు,(కుష్ఠు) రోగగ్రస్తులకూ, అనాథలకూ, మరణశయ్యపై ఉన్నవారికీ పరిచర్యలు చేసింది.ద్వారా 1970 ల నాటికి మానవతా వాదిగా, పేద ప్రజలు, నిస్సహాయుల అనుకూలురాలిగా అంతర్జాతీయ కీర్తి పొందింది. ఈమె తన మానవ సేవకు గాను 1979లో నోబెల్ శాంతి పురస్కారాన్ని, 1980లో భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్నను పొందిందనీ.మదర్ థెరీసా మిషనరీస్ అఫ్ ఛారిటీ బాగా విస్తృతమై, ఆమె చనిపోయే నాటికి 123 దేశాలలో 610 సంఘాలను కలిగి, హెచ్ఐవి/ఎయిడ్స్, కుష్టు, క్షయ వ్యాధిగ్రస్తులకు ధర్మశాలలను, గృహాలను, ఆహార కేంద్రాలను, బాలల, కుటుంబ సలహా కార్యక్రమాలను, అనాథ శరణాలయాలను, పాఠశాలలను స్థాపించిందనీ. ఆమె అనేక మంది వ్యక్తులు, ప్రభుత్వాలు, సంస్థలచే ప్రశంసలు పొందిందని,ఆమె మరణానంతరం పోప్ జాన్ పాల్ II చే దైవ ఆశీర్వాదం (బీటిఫికేషన్),సేయింట్ మరియు బ్లెస్డ్ థెరెసా ఆఫ్ కలకత్తా బిరుదు పొందిందనీ అన్నారు.

ఈ కార్యక్రమంలో సూర్యాపేట పాస్టర్స్ గౌరవ సలహాదారులు రెవ. డా. పి. జాన్ మార్క్, రెవ. బొక్క ఏలీయా రాజు,సూర్యాపేట పట్టణ పాస్టర్స్ పెలోషిఫ్ అధ్యక్షులు రెవ. ఇంజమూరి గాబ్రియేల్, ప్రధాన కార్యదర్శి రెవ. ధరవత్ లాకు నాయాక్,వర్కింగ్ ప్రెసిడెంట్ బ్రదర్ బొజ్జ ప్రశాంత్ కుమార్ ,నియోజకవర్గ అధ్యక్షులు రెవ. డా. జలగం జేమ్స్, పెన్ పహాడ్ పెలోషిప్ అధ్యక్షులు రెవ. డా. దేవతోటి జాన్ ప్రకాష్, నియోజకవర్గం గౌరవ సలహా దారులు రెవ. బొక్క ఏలీయా రాజు, సూర్యాపేట రూరల్ అధ్యక్షులు పాస్టర్ యల్క ప్రభాకర్,రూరల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏర్పుల క్రిస్టోఫర్,రెవ. డా. పంది మార్క్,పాస్టర్ కొండేటి లాజర్,బ్రదర్ చెరుకు బాబు రావు,పాస్టర్ ఒగ్గు ప్రవీణ్, పాస్టర్ మొరుగురి రూబెన్, రెంటాల విజయమ్మ,ప్రకాష్ పాల్, జాషువా, గిద్యోన్, క్రిష్టఫర్,రాజు,బచ్చలకూరి ఆనంద్ బాబు, బానోత్ సుధాకర్, యడవెల్లి అబ్రాహాము,పాస్టర్ పాముల సంజీవ, బాణాల సైమన్ తదితరులు పాల్గొన్నారు.

Shake Jaheer Staff Reporter Suryapet District Telangana 508223