ప్రపంచంలోనే మన పార్లమెంట్ వ్యవస్థ గొప్పది:జిల్లా అదనపు కలెక్టర్

Mar 11, 2024 - 20:46
 0  4
ప్రపంచంలోనే మన పార్లమెంట్ వ్యవస్థ గొప్పది:జిల్లా అదనపు కలెక్టర్

జోగులాంబ గద్వాల 11 మార్చ్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల ప్రపంచంలోనే మన పార్లమెంట్ వ్యవస్థ గొప్పదని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ముసిని వెంకటేశ్వర్లు అన్నారు.సోమవారం జిల్లా కేంద్ర్రంలోని ఎం.ఎ.ఎల్.డి కళాశాలలో నైబర్ హుడ్ యూత్ పార్లమెంట్ మాక్ పార్లమెంట్ అనే అంశంపై భారత ప్రభుత్వం యువజన సర్వీసులు క్రీడల మంత్రిత్వ శాఖ నెహ్రూ యువత కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ముసిని వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ విద్యార్థులకు పార్లమెంట్ యొక్క విశిష్టతను హక్కులను బాధ్యతలపై మాట్లాడారు.అనంతరం విద్యార్థులు పాల్గొని వారి యొక్క ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు  మెమెంటో, సర్టిఫికెట్లను  అందజేశారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కళాందర్ భాష , నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారి ప్రొఫెసర్ కోట నాయక్, వైస్ ప్రిన్సిపల్ శ్రీపతి నాయుడు , కళాశాల అధ్యాపక బృందం,  ఎన్.వై.కే ప్రతినిధులు అనిల్, రాజేందర్ గౌడ్ , విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333