తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుల గణంకాల తో పాటు వెంటనే ఎస్ సి .ఎస్టి . మరియు ఓబీసీ ల క్రైస్తవుల వెంటనే చేపట్టాలి
తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి కీ త్వరలో వినతి పత్రం సమర్పించనున్న రాష్ట్ర కమిటీ సభ్యులు *బిషప్ దుర్గం ప్రభాకర్*
తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి
బుధవారం 18 సెప్టెంబర్ : సూర్యాపేట మున్సిపాలిటీ కేంద్రం నందు,శాంతినగర్ బేతెస్థ మినిస్ట్రీస్ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు సూర్యాపేట జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బిషప్ దుర్గం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ క్రైస్తవం, ముస్లిం మతాల్లోకి మారిన దళితులకు ఎస్సీ హోదా కల్పించే అంశంపై అధ్యయనానికి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేజీ బాలకృష్ణన్ నేతృత్వంలో కమిషన్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందనీ,దళిత క్రిస్టియన్లను, దళిత ముస్లింలకు షెడ్యూల్డ్ కులాల(ఎస్సీ) రిజర్వేషన్ హోదా అంశం మరోసారి తెరపైకి వచ్చిందనీ,వీరి స్థితిగతులపై అధ్యయనానికి *సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కె.జి.బాలకృష్ణన్ సారథ్యంలో కొత్త కమిటీని* కేంద్రం ఏర్పాటు చేయటమే ఇందుకు కారణం అనీదేశంలో తరతరాల సామాజిక అవలక్షణం అంటరానితనం కారణంగా ఎస్సీలను బాధితులైన వర్గాలుగా భావించి రాజ్యాంగం వారికి రిజర్వేషన్లను కల్పించిందనీ.1950లో కేవలం హిందువుల్లోని ఎస్సీలకు మాత్రమే ఈ రిజర్వేషన్లు కల్పించి మోసం చేశారని తర్వాత 1956లో సిక్కు మతంలోని దళితుల్నీ, 1990లో బౌద్ధ దళితుల్ని ఇందులో బలవంతంగా చేర్చారనీ కేంద్ర ప్రభుత్వం రెండు కమిటీలను ఏర్పాటు చేశారనీ. 2004లో మత, భాష పరమైన మైనార్టీలకు జాతీయ కమిషన్ ఏర్పాటు చేశారని, దీన్నే రంగనాథ్ మిశ్ర కమిషన్ అంటారనీ . ఈ కమిషన్ ఎస్సీ హోదాకు, మతానికి లంకె అవసరం లేదని సిఫార్సు చేసిందన్నారు.రెండోది జస్టిస్ రాజేందర్ సచార్ కమిషన్ దేశంలో ముస్లింల సామాజిక, ఆర్థిక, విద్యాసంబంధ పరిస్థితులపై 2005లో ఈ కమిటీ ఏర్పాటైందనీ. మత మార్పిడి తర్వాత కూడా దళిత ముస్లిం, దళిత క్రైస్తవుల పరిస్థితుల్లో మార్పు రాలేదని ఏడుగురు సభ్యుల సచార్ కమిషన్ తేల్చి చెప్పిందని అన్నారు.క్షేత్రస్థాయిలో పరిస్థితిని బేరీజు వేయటానికి అవసరమైన గణాంకాలు లేవనే కారణంతో ఈ కమిషన్ సిఫార్సులను ఆమోదించలేదనీ అన్నారు,తర్వాతికాలంలో సామాజిక శాస్త్రవేత్త సతీశ్ దేశ్‌పాండే సారథ్యంలోని ఓ కమిటీ 2008లో ఓ నివేదిక ఇచ్చిందనీ దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలకూ ఎస్సీ హోదా విస్తరించాలంటూ సిఫార్సు చేసిందనీ గుర్తు చేశారు. జాతీయ మైనార్టీ కమిషన్ కూడా ఇలాంటి ప్రతిపాదనలే చేసిందనీ అన్నారు,అయినా కానీ సరైన గణాంకాలు లేనందున వీటన్నింటనీ పరిగణనలోకి తీసుకోలేదు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు కుల ఘనంకణ తో పాటు యస్. సి, యస్. టి & బి. సి మరియు ఓ.బి.సి. క్రిస్టియన్ ల ఘనంకణ చెపట్టాలని త్వరలో రాష్ట్ర పతికి, మరియు ప్రధాన మంత్రి కీ తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కీ వినతి పత్రం అందించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం లో తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్టాల కో ఆర్డినేటర్ పాస్టర్ సి. హెచ్. శ్యామ్ ప్రసాద్, సూర్యాపేట జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు బిషప్ ముల్లంగి జాకబ్ రాజు, సూర్యాపేట నియోజకవర్గ పాస్టర్స్ పెలోషిఫ్ అధ్యక్షులు రెవ. డా. జలగం జేమ్స్,నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు రెవ. బొక్క ఏలీయా రాజు, రెవ. ఉటుకూరి రాజు, పాస్టర్స్ కొండేటి లాజర్, యం. రూబెన్, ఏర్పుల క్రిస్టోఫర్, పంది మార్క్, సి. హెచ్. కిరణ్ కుమార్, యడవెల్లి అబ్రాహాము, బానోత్ సుధాకర్, కొమ్ము హోసన్నా తదితరులు పాల్గొన్నారు