సింగరేణి బదిలీ వర్కర్ల క్రమబద్ధీకరణ పూర్తి...
సింగరేణిలో పనిచేస్తున్న 2, 349 మంది బదిలీ వర్కర్లు జనరల్ మజ్దూర్లుగా క్రమబద్ధీకరిస్తూ సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది.
క్యాలెండర్ ఏడాదిలో భూగర్భగనుల్లో 190 రోజులు, ఉపరితల గనులు విభాగాల్లో 240 రోజులు విధులు నిర్వర్తించిన వారిని రెగ్యులరైజ్ చేసింది.
సెప్టెంబర్ 1, 2024 నుంచి వీరిని జనరల్ మజ్దూర్లుగా గుర్తించినట్లు ఉత్తర్వుల్లో వెల్లడించారు.