బాల్య స్నేహితురాలు మృతుని కుటుంబానికి 20.500రు"ఆర్థిక సహాయం
అడ్డగూడూరు 12 సెప్టెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని వెల్దేవి గ్రామానికి చెందిన జూలూరి వెంకటయ్య (60) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఆయన పెద్ద కుమార్తె మహాలక్ష్మి 2007 పదవ తరగతి బ్యాచ్ స్నేహితులు వారి కుటుంబానికి ఎంతో కొంత ఆర్థికంగా అండగా నిలవాలని స్నేహితుల అందరి సహకారంతో 20,500 రూపాయల సహాయం చేసి, వెంకటయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంటిపల్లి సతీష్ యాదవ్, గోలి నరసింహ, లోడే యాదగిరి తదితరులు పాల్గొన్నారు.