ఇది పశు వైద్యశాల లేకపోతే ???

ప్రహరీ గోడ గేటు మాయం...
వ్యవసాయ పనిముట్లు ఇక్కడే
గత పది సంవత్సరాల నుండి స్టోర్ రూమ్ గా పశువైద్యశాలను వాడుకుంటున్న వైనం
చోద్యం చూస్తున్న సంభందిత అధికారులు
పశువైద్యం పడకేసింది.....
మూగజీవాలే కదా..చచ్చినా... ప్రశ్నించేవారెవరు అనే తీరులో .
పట్టించుకోని సంబంధిత అధికారులు
తిరుమలగిరి 06 ఆగస్టు 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:
ప్రభుత్వం ఓవైపు వ్యవసాయాన్ని పండగల చేస్తున్నామని ప్రకటనలు ఇస్తుంది. దానికోసం వ్యవసాయానికి మూలధారమైన మూగ జీవాలను రక్షించేందుకు పశువైద్యశాలలు ఏర్పాటు చేసి వైద్యం అందిస్తుంది.కానీ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం వల్ల ప్రభుత్వ పశువైద్యశాలలు దయనీయ స్థితిలో ఉన్నాయి. వ్యవసాయ పనుల్లో పశువులను కీలక పాత్ర పోషిస్తాయి అలాంటి పశువులకు గొర్లకు మేకలకు ఏవైనా వ్యాధులు సంక్రమిస్తే వైద్యశాలకు వైద్యం కోసం తీసుకువస్తున్న రైతులకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.. వివరాలకు వెళితే సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరి గ్రామంలో ఏర్పాటుచేసిన పశు వైద్యశాల లోనే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు పంచాయితీలు తీర్మానం చేయుట గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి అయితే చాలు మందు బాబులకు అడ్డాగా మారింది. అసాంఘిక కార్యకలాపాలకు పాలు పడుతూ వారికి నచ్చినట్టుగా ఇస్తానుసారంగా వ్యవహరిస్తున్నారు.. గత ప్రభుత్వంలోనే పశు వైద్యశాల ఎదుటి కాంపౌండ్ వాల్ గేటు లక్ష రూపాయల కు మంజూరు అయింది కానీ గేటు నిర్మించడం లేదు లక్ష రూపాయలను దండుకొని చేతులు దులుపుకున్న కాంట్రాక్టర్.. వచ్చి పోయే రైతులకు ఎంతో సౌకర్య కరంగా ఉండేది. నేడు చుట్టూ ప్రహరీ గోడ ఉన్న గేటు లేకపోవడంతో కొందరు వ్యక్తులు తమ వ్యవసాయ క్షేత్రానికి సంబంధించిన ట్రాక్టర్, కల్టివేటర్ లు, తన ఇంటి సామానులను వస్తువులను భద్రపరుస్తున్నారు లోపలికి చెత్తాచెదారం చేరుతోంది. పశువులు రావడం, మనుషులు కూడా లోపలికి వచ్చి బహిర్భూమి లకు వెళ్ళడం చేస్తున్నారు.ఆస్పత్రి ఆవరణలో చదును చేయడం. సి సి రోడ్డు వేయడం చేయిస్తామని గత ప్రభుత్వంలో హామీలు ఇచ్చారు అది అలాగే మిగిలిపోయింది ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పశు వైద్యశాల ప్రహరీ గోడకు గేటు నిర్మించి చెత్తాచెదారం తొలగించి రైతులకు ఉపయోగపడేలా ఉండాలని , అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై,వ్యక్తిగత స్టోర్ రూంలుగా వాడుకునే వ్యక్తులపై చర్యలు తీసుకోవాల్సిందిగా గ్రామ రైతులు, ప్రజలు యువకులు కోరుతున్నారు...