గౌరవరం హెడ్ రెగ్యులేటర్ నుంచి కంచల ఏటూరు మేజర్ కాలువకు"" జల హారతి

ఏపీ తెలంగాణ వార్త ప్రతినిధి గౌరవరం : గౌరవరం హెడ్ రెగ్యులేటర్ నుంచి కంచల ఏటూరు మేజర్ కాలువలకు జల హారతి కార్యక్రమం.. ఎన్టీఆర్ జిల్లాలోని గౌరవరం హెడ్ రెగ్యులేటర్ నుంచి కంచల ఏటూరు మేజర్ కాలువలకు నీటి విడుదల కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,శాసనసభ్యులు శ్రీమతి తంగిరాల సౌమ్య గారు, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఉమ్మడి కృష్ణాజిల్లా కేడీసీసీ బ్యాంకు చైర్మన్ శ్రీ నెట్టెం రఘురాం గారు, జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీ శ్రీరాం రాజగోపాల్ గారు, పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జల హారతి కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. శ్రీమతి తంగిరాల సౌమ్య గారు మాట్లాడుతూ, రైతులకు సాగునీరు అందించడం ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కాలువల నీటి విడుదలతో స్థానిక రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని, పంటల ఉత్పాదకత పెరుగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీ నెట్టెం రఘురాం గారు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని, ఈ కార్యక్రమం ఆ దిశగా ఒక ముఖ్యమైన అడుగు అని అన్నారు. జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ గారు మాట్లాడుతూ, సాగునీటి సౌకర్యం రైతుల జీవనోపాధికి కీలకమని, ఈ ప్రాంతంలో వ్యవసాయ అభివృద్ధికి ఈ నీటి విడుదల కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్ఎస్పి యంత్రాంగం అధికారులు, లాల్ బహుదూర్ లెఫ్ట్ కెనాల్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కోట వీరబాబు, డిసి చైర్మన్లు, స్కిన్ ప్రెసిడెంట్లు, స్థానిక నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని, జల హారతిని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం రైతులకు నీటి సౌకర్యాన్ని మెరుగుపరచడంతో పాటు, ప్రాంతీయ వ్యవసాయ అభివృద్ధికి ఊతం ఇచ్చే ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలిచింది.