ఆరోగ్యమే మహాభాగ్యం"జయప్రద ఫౌండేషన్"నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం*జగ్గయ్యపేట

Jul 31, 2025 - 20:10
Aug 1, 2025 - 20:03
 0  29
ఆరోగ్యమే మహాభాగ్యం"జయప్రద ఫౌండేషన్"నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం*జగ్గయ్యపేట

ఏపీ తెలంగాణ వార్త ప్రతినిధి జగ్గయ్యపేట : ఆరోగ్యమే మహాభాగ్యం – *జయప్రద ఫౌండేషన్* నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతం

వత్సవాయి మండలం, మక్కపేట గ్రామం, జూలై 31: పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలన్న లక్ష్యంతో జయప్రద ఫౌండేషన్ చైర్మన్

 శ్రీ *తొండపు దశరథ జనార్దన్* గారు రూపొందించిన “హాస్పిటల్ అన్ వీల్స్” సంచార వైద్య శిబిరం ఈరోజు మక్కపేట గ్రామంలో విజయవంతంగా ప్రారంభమైంది.

ఈ కార్యక్రమంలో వివిధ వైద్య విభాగాల నిపుణులు పాల్గొని ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన మందులు ఉచితంగా పంపిణీ చేయడం ద్వారా ప్రజల్లో వైద్య అవగాహన పెరిగేలా చేశారు.

ముఖ్యాంశాలు:

మొత్తం 500 మందికి పైగా ప్రజలు ఈ శిబిరం సేవలను పొందారు.

కంటి పరీక్షలు – 350 మందికి

దంత వైద్య పరీక్షలు – 48 మందికి

జనరల్ వైద్య సేవలు – 102 మందికి

ఇతర పరీక్షలలో:

షుగర్, బీపీ

రక్తపరీక్షలు

కొలెస్ట్రాల్

ఈసీజీ

 హిమోగ్లోబిన్

వంటివి చక్కగా నిర్వహించారు.

ఈ శిబిరాన్ని విజయవంతం చేయడంలో గ్రామ సర్పంచ్ మల్లెల శివప్రసాద్, డాక్టర్ కామినేని భూపాల్ రావు, కోఆర్డినేటర్ కట్టా వెంకట నరసింహారావు మరియు కట్టా కోటయ్య ఫౌండేషన్ వాలంటీర్ల పాత్ర ప్రముఖంగా నిలిచింది.

 *జయప్రద ఫౌండేషన్* చేపట్టిన ఈ ఆరోగ్య శిబిరం పట్ల ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరహా కార్యక్రమాలు మరిన్ని గ్రామాలలో జరగాలని ఆశిస్తున్నo

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State