ప్రాంతీయ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ మొబైల్ ల్యాబ్ వ్యాన్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ
గద్వాల ( ఆగస్టు 05 )నేర పరిశోధనలో కీలకంగా ఉపయోగపడే ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ మొబైల్ ల్యాబ్ వ్యాన్ ను జిల్లా కేంద్రంలో మంగళవారం ఎస్పీ టి శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ-- నేరం జరిగిన ప్రదేశానికి వెళ్లి తక్షణమే పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా ఈ వాహనం పూర్తి సదుపాయాలతో కూడిన మొబైల్ ల్యాబ్ గా పనిచేస్తుందని అన్నారు.నేరం జరిగిన ప్రదేశానికి వెళ్లి, ఆయా ప్రదేశంలో లభించిన అన్ని రకాల సాక్ష్యాలను (ఫింగర్‌ప్రింట్స్, రక్తపు నమూనాలు, ఇతర ఆధారాలు) సేకరించి, ప్రాథమిక విశ్లేషణలు చేసే ఈ వాహనం నేర పరిశోధనలో చాలా ముఖ్యమైనదని అన్నారు. ఈ కార్యక్రమంలో సాయుధ దళ డిఎస్పీ నరేందర్ రావు,ఎస్.బి ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రెడ్డి,ఆర్.ఐ. వెంకటేష్, క్లూస్ టీం ఇంచార్జి ఎస్సై లు సుకుర్, స్వాతి,మరియు క్లూస్ టీం సిబ్బంది పరమేష్, దాకూద్ పాల్గొన్నారు.