శ్రీరామ్ సాగర్ నీళ్లు గల గల పారుతున్న కాలువలు
రైతు ఆశలు కాస్త ఉపశమనం
తుంగతుర్తి:మర్చి 12తెలంగాణవార్త ప్రతినిధి:- శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తటంతో ఈరోజు తుంగతుర్తి మండలానికి చేరుకున్నాయి. రైతు సోదరుల కళ్ళలో ఆనందం వ్యక్తం చేశారు. సీజన్ ఆరంభంలో కొంతమేర వానలు ఊరించడంతో సీజన్ కలిసివస్తుందన్న ఉద్దేశంతో అన్నదాతలు పంటలు సాగు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురిస్తే సాగునీటికి ఇబ్బందులు ఉండవని భావించారు. వీటికి తోడు బోర్లు, బావులు ఉండటంతో పంటలకు ఇబ్బందులు తలెత్తవని కర్షకులు అనుకున్నారు. కానీ రైతుల అంచనాలు తలకిందులయ్యాయి.
ఆయకట్టు భూముల్లో బిరబిరా ప్రవహించాల్సిన కృష్ణమ్మ సందడి లేక పంటలు వెలవెలాబోతున్నాయి. కృష్ణమ్మ కరుణించక పోతుందా అని రైతులు ఎదురుచూస్తున్నారు. లక్షలకు లక్షలు పెట్టుబడి పెట్టిన పంటలు సాగునీరందక తడారి పోతుంటే ఆయకట్టు రైతుల కళ్లల్లో నీళ్లు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు ఆవేదన రాష్ట్ర ప్రభుత్వం తీర్చింది. సాగర్ ఎడమ కాలువ క్రింద ఉన్న రైతుల కోసం నీటిని విడుదల చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. దీంతో పంట సాగు రైతులు కాస్త ఉపశమనం కల్పించినట్లైంది.