శివునికి పాలాభిషేకం జలాభిషేకం

Aug 4, 2025 - 21:51
 0  0
శివునికి పాలాభిషేకం జలాభిషేకం

04-08-2025 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం.

 చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన పెద్ద మారు గ్రామంలో  శివునికి జలాభిషేకం

 శ్రావణమాసం రెండవ సోమవారం పురస్కరించుకుని  పుష్కలంగా వర్షాలు కురిసి. పాడిపంటలతో అన్నదాత ఆనందంగా ఉండాలని, ఏ లాంటి అంటు వ్యాధులు రాకుండా చూడాలని  చిన్నంబావి మండలం పెద్ద మారూర్ గ్రామంలో సోమవారం శ్రీ. సీతరాముల ఆంజనేయ స్వామి ఆలయంలో కృష్ణానది జలాల నుండి నీళ్లను తీసుకొచ్చి దేవుళ్లకు జలాభిషేకం చేశారు గ్రామ కుల పెద్దలైన దేవాదాయ  కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమలు కనుల పండుగ నిర్వహించారు. శివాలయంలో శివునికి జలాభిషేకం చేశారు. భాజా భజంత్రీలతో  కలిసి వెళ్లి అమ్మవార్లకు జలాభిషేకం చేసి మొక్కలు మొక్కుకున్నారు ఈ అనవైతి గత 35 సంవత్సరాలుగా పెద్దమారూర్ గ్రామంలో కొనసాగుతుంది. ప్రతి ఏటా గ్రామ శివాలయంలో అభిషేకం చేయడం అనవైతి కొనసాగుతుంది అని గ్రామస్తులు తెలిపారు.

 ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు రమణయ్య, నరేందర్ గౌడు, హనుమంతరావు, శివారెడ్డి,ఎస్ శ్రీనివాసులు, ధర్మారెడ్డి,శివకుమార్, సతీష్, గొల్ల ఆంజనేయులు, కోంటి  శ్రీనివాసులు, యాదగిరి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Vishnu Sagar Chinnamabavi Mandal Reporter Wanaparthi District Telangana State