పర్యావరణ పరిరక్షణకు అందరూ నడుం బిగించాలి
జిల్లా న్యాయమూర్తి కే కుష

జోగులాంబ గద్వాల 5 జూన్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- పర్యావరణ పరిరక్షణకు అందరూ నడుం బిగించాలని జిల్లా న్యాయమూర్తి కే కుష అన్నారు. బుధవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా న్యాయమూర్తి కుష ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక కోర్టు ఆవరణ నుండి అంబేద్కర్ చౌక్ మీదుగా కోర్టు వరకు ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా న్యాయమూర్తి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరూ పాటించాలని తెలిపారు. మొక్కలను విరివిగా నాటడం వల్ల ప్రాణవాయువు ఇస్తాయని దానివల్ల మానవజాతి మనుగడకు సాధ్యం అవుతుందన్నారు.
చెట్లను నరకడం వల్ల పర్యావరణ సమతుల్యత తగ్గిపోతుందని తెలిపారు. ఈ సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణ పరిరక్షణకు పాటుపడదాం అంటూ న్యాయవాదులు నినాదాలు చేశారు. ప్లాస్టిక్ వాడడం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని ప్రతి ఒక్కరు బట్ట సంచులు వాడాలని సూచించారు. అనంతరం కోర్టు ఆవరణలో జిల్లా న్యాయమూర్తి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు గంటా కవితా దేవి,ఉదయ నాయక్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు రఘురాంరెడ్డి, ఉపాధ్యక్షులు ఖాజా, ట్రెజరర్ ఆనందరావు,కోర్టు కార్యవర్గ సభ్యులు, సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.