ఇంటర్ అడ్మిషన్స్ ల లక్ష్యం చేరుకోవాలి

Aug 5, 2025 - 19:29
 0  9
ఇంటర్ అడ్మిషన్స్ ల లక్ష్యం చేరుకోవాలి
ఇంటర్ అడ్మిషన్స్ ల లక్ష్యం చేరుకోవాలి

పదో తరగతి ఉతీర్ణులైన ప్రతి విద్యార్ధి డ్రాపుఅవుట్ గా ఉండకూడదు.

పోటి పరీక్ష లకు అన్లైన్ క్లాసులు చూపాలి.

అన్ని రకాల ఇన్ ఫ్రా వివరాలు పంపండి.

ప్రారంభం నుండే ప్రాక్టికల్స్ చేయించాలి.

ఇంటర్మీడియట్ డిప్యూటీ సెక్రటరీ,     *ఉమ్మడి జిల్లా స్పెషల్ ఆఫీసర్ *శ్రీ  కె.విశ్వేశ్వర్

 జోగులాంబ గద్వాల 5ఆగస్టు 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి :  అలంపూర్,. మనోపాడు, మల్దకల్ :      తెలంగాణ రాష్ట్ర0 లో అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాల కు ఇంటర్మీడియట్ కమిషనర్ మరియు కార్యదర్శి శ్రీ కృష్ణ ఆదిత్య అదేశాల ప్రకారం అడ్మిషన్ ల లక్ష్యం చేరుకోవాలని డిప్యూటీ సెక్రటరీ ఉమ్మడి మహబూబ్ నగర్  జిల్లా ఇంటర్ స్పెషల్ ఆఫీసర్ శ్రీ కె. విశ్వేశ్వర్ అన్నారు. మంగళవారం ఇంటర్ స్పెషల్ ఆఫీసర్ శ్రీ కె.విశ్వేశ్వర్ ఇంటర్మీడియట్ విద్యా నోడల్ ఆఫీసర్ శ్రీ ఎం. హృదయ రాజు తో కలిసి ప్రభుత్వ జూనియర్ కళాశాలలు అలంపూర్, మనోపాడు, మల్దకల్ లను  ఆకస్మికంగా విజిట్ చేసి తనిఖీ చేశారు. ప్రేయర్ లో విద్యార్థుల తో ముఖాముఖీ నిర్వహించి ప్రతి ఒక్క విద్యార్థి రెగ్యులర్ గా కళాశాల కు రావాలని, బాగా చదువుకొని ఉన్నత స్థానం లో ఉండాలని కోరారు, రాష్ట్ర0లో ప్రతి జూనియర్ కళాశాలలో  పూర్తిస్థాయి లో అధ్యాపకులు వున్నారని తెలిపారు, పదో తరగతి పాస్ అయిన ప్రతి విద్యార్థి కళాశాలలో అడ్మిషన్ పొందాలని, ప్రతి విద్యార్థి ఇద్దరు విద్యార్థులను తీసుకురావాలని కోరారు. అనంతరం ప్రిన్సిపాల్, అధ్యాపకులు, సిబ్బంది తో సమావేశం నిర్వాహించి, పలు సూచనల చేశారు. కమిషనర్ కళాశాలల కు కావలసిన మౌలిక వసతుల కోరకు నిధులు మంజూరు చేశారని తెలిపారు. కళాశాల, ల్యాబ్ లకు సంబందించిన ఇన్ ఫ్రా కొరకు ప్రతిపాదనలు పంపాలని తెలిపారు. సైన్స్ ల్యాబ్ ల రామెటీరియల్ కొరకు, విద్యార్థులు  క్రీడాలు ఆడుకోవడానికి క్రీడా పరికరాలు కొనుగోలు కు నిధులు మంజూరు చేశామని తెలిపారు.ప్రతి శనివారం విద్యార్థుల తో క్రీడా లు ఆడించాలని సూచించారు. 
    ఖాన్ అకాడమి, ఫిజిక్స్ వాలా సహకారం తో విద్యార్థుల కు ఎప్సెట్ (ఎంసెట్), నీట్, జెఇఇ మెయిన్స్, అడ్వాన్స్, సి ఎ, తదితర పోటి పరీక్షల కొరకు ప్రత్యేక సమయ పట్టిక లో సూచించిన ప్రకారం అన్ లైన్ తరగతులు వినిపించాలని ఆదేశించారు. విద్యార్థుల ఆపార్ ను త్వరగా పూర్తి చేయాలనీ ప్రిన్సిపాల్స్ కు తెలిపారు.
        ఈ కార్యక్రమం లో ఆయా కళాశాల ప్రిన్సిపాల్స్ శ్రీమతి పద్మావతి,జి. కృష్ణ, అధ్యాపకులు, నాన్ టీచింగ్ సిబ్బంది వున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333