గోన్పాడు లోని కేజీబీవీ స్కూల్ నందు విద్యార్థులకు సి టీం అవగాహన సదస్సు

Aug 5, 2025 - 19:46
 0  11
గోన్పాడు లోని కేజీబీవీ స్కూల్ నందు విద్యార్థులకు సి టీం అవగాహన సదస్సు
గోన్పాడు లోని కేజీబీవీ స్కూల్ నందు విద్యార్థులకు సి టీం అవగాహన సదస్సు

 జోగులాంబ గద్వాల5 ఆగస్టు 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి :  గద్వాల జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు, ఐపీఎస్ ఆదేశాల మేరకు పోలీస్ షీ టీం బృందం గద్వాల్ మండలం గోనుపాడ్ లోని KGBV స్కూల్ నందు విద్యార్థులకు షీ టీం అవగాహన సదస్సు  నిర్వహించడం జరిగినది.  అందులో భాగంగా షీ టీం ఇంచార్జి తెజేశ్విని మాట్లాడుతూ మహిళల భద్రత మరియు ఆన్లైన్ మోసాలపై మరియు యాంటీ డ్రగ్స్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి తెలియజేశారు.  ఎవరైనా చెడు గా మాట్లాడిన, ప్రవర్తించిన తల్లిదండ్రులకు చెప్పాలాని, మరియు వాటి నుంచి ఎలా బయటపడటం పై అవగాహన కల్పించారు.  మహిళల రక్షణ కోసం షీ టీం బృందం ప్రతి రోజు బస్టాండ్ మరియు ప్రధాన చౌరస్తా ల లో, కళాశాలలు, పాఠశాలల దగ్గర,  జన సమీకరణ ప్రాంతాల్లో  వద్ద షీ టీం నిరంతరంగా ఉంచడం జరుగుతుందని , ఎవరైనా వేధింపులకు గురి చేస్తే మహిళలు విద్యార్థులు భయపడకుండా 8712670312 నంబర్ కు  ఫోన్ చేసి సమస్య తెలపాలని కోరారు. ఫోన్ చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని స్పష్టం చేశారు. అలాగే అత్యాశకు పోయి సైబర్ క్రైమ్ ఆన్లైన్ మోసాలు ,లోన్ యాప్స్ గురవుతున్నారని వాటికి జోలికి పోకుండా ఉండాలని, ఎవరైనా ఆన్లైన్ మోసాలకు గురైతే  సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కి  సమాచారం ఇవ్వాలని, అలాగే మహిళలకు ఏదైనా ప్రమాదం ఉన్నట్లయితే, బెదిరింపులకు గురైతే వెంటనే డయాల్- 100 నంబర్ కు డయల్ చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమం స్కూల్ HM శ్రీదేవి, షీ టీమ్ సభ్యులు శేషన్న, లోకేశ్వరి, హన్మంతు,   మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333