పిల్లలమర్రి శివాలయం లో దైవ దర్శనం చేసుకున్న జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్

Feb 27, 2025 - 18:53
Feb 27, 2025 - 19:01
 0  7
పిల్లలమర్రి శివాలయం లో దైవ దర్శనం చేసుకున్న జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్

ప్రజలంతా సంతోషంగా కలిసిమెలిసి ఉండాలి - ఎస్పి

సూర్యాపేట 27 ఫిబ్రవరి 2024 తెలంగాణవార్త ప్రతినిధి:-  మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ గారు కుటుంబ సమేతంగా పిల్లలమర్రి శివాలయం నందు దైవ దర్శనం చేసుకుని పూజలు నిర్వహించారు. ప్రజలంతా సంతోషంగా ఉండాలని, ఉత్సవాలను అందంగా జరుపుకోవాలని కోరారు. ఈ సందర్బంగా దేవాలయం కమిటీ వారు ఎస్పి గారి కుటుంభానికి దేవాలయం చిత్రపట జ్ఞాపికను బహూకరించారు.

అనంతరం దేవాలయం వద్ద పోలీసు బందోబస్తు పరిశీలించి భక్తుల సౌకర్యార్థం పని చేయాలని అన్నారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రజల రక్షణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రముఖ శివాలయాలు, ఇతర దేవాలయాల వద్ద ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశాం అని తెలిపినారు. ఎస్పి  వెంట సూర్యాపేట రూరల్ CI రాజశేఖర్, SI బాలు నాయక్, సిబ్బంది ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333