కేసుల చేదనకు అన్ని కోణాలలో అన్వేషించాలి

Jan 20, 2025 - 21:47
Jan 20, 2025 - 21:47
 0  4
కేసుల చేదనకు అన్ని కోణాలలో అన్వేషించాలి
కేసుల చేదనకు అన్ని కోణాలలో అన్వేషించాలి

గ్రామాలను సందర్శించి పూర్తి స్థాయి లో నిఘా ఉంచాలి

నేర సమీక్ష సమావేశంలో-------- జిల్లా ఎస్పీ శ్రీ టి . శ్రీనివాస రావు ఐపీఎస్  .

జోగులాంబ గద్వాల 20 జనవరి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి. గద్వాల. జిల్లాలోని ప్రతీ గ్రామాన్ని పోలీస్ అధికారులు సందర్శించి గ్రామాలలో పూర్తి స్ధాయిలో నిఘా ఉంచడం ద్వారా ఎప్పటికప్పుడు నేరాలకు సంబంధించిన సమాచారం ముందస్తుగా తెలుసుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్  పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయం లోని సమావేశ హల్ నందు పోలీస్ 
అధికారులతో జిల్లా ఎస్పి  నెల వారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ  పోలీస్ స్టేషన్ ల వారిగా గత నెలలో నమోదు అయిన కేసులు,  UI లో ఉన్న కేసులను పరిశీలించారు. అందుకు సంబంధించి కేసు దర్యాఫ్తు లో పారదర్శకంగా విచారణ చేపట్టాల్సిన అంశాల గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల పై  అధికారులకు పలు సూచనలు చేశారు. 

ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ  మాట్లాడుతూ----- త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేందుకు అవకాశం ఉన్నందున ప్రతి గ్రామాన్ని పోలీస్ అధికారులు వారానికి ఒక సారి సందర్శించి పూర్తి స్ధాయిలో నిఘా ఉంచాలని, గ్రామాలలో సమస్యలు సృష్టించే వారిని ముందుగానే గుర్తించి తగు చర్యలు చేపట్టాలని అన్నారు. ఎక్కవ మంది పబ్లిక్ తో పోలీస్ అధికారులు కాంటాక్ట్ కావడం ముందస్తు సమచారం తెలుసుకునేందుకు అవకాశం ఉంటుందని అన్నారు.  రేపటి నుండి ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అయిన ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డు, ఇతర పథకాలకు ఎంపిక చేసేందుకు  ఆయా శాఖల అధికారులు గ్రామ సభలు నిర్వహిస్తారని ఆ సభలలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని అన్నారు. ఇసుక, పీ. డి. ఎస్ రైస్ అక్రమ రవాణా, పేకాట జరగకుండా పకడ్బందీ గా నిఘా ఉంచి పట్టుకొని కేసులు నమోదు చెయ్యాలని అన్నారు.
నమోదు అయిన పోక్సో కేసులలో 60 రోజుల లోపు విచారణ పూర్తి చేసి చార్జీ షీట్ వెయ్యాలని అన్నారు. 
ప్రాపర్టీ నేరాల నియంత్రణకు పకడ్బందీ గా చర్యలు చేపట్టాలని, కేసుల చెదనలో అన్నీ కోణాలలో అన్వేషించాలని అన్నారు.  హై వే పెట్రోలింగ్ అధికారులు జాగ్రత్తగా ఉండాలనీ, ఇతర రాష్ట్రాలలో జరిగినట్టు ATM దొంగతనాలు, ఇతర రాబరీ లాంటి వీ జరగకుండా పూర్తి నిఘా ఉంచాలని సూచించారు. పాత కేసులను పెండిoగ్ ఉంచకుండా ఇన్వెస్టిగేషన్ పూర్తి చెయ్యాలని  అన్నారు. సంక్రాంతి సందర్బంగా జాతీయ రహదారి గుండా ,  క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్బంగా పోలీస్ అధికారులు, సిబ్బంది నిర్వహించిన బందోబస్తు నిర్వహణ పై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆపరేషన్ స్మైల్, షి టీమ్ నిర్వహణ ను పరిశీలించారు. జిల్లా లో విసృతంగా తనిఖీలు చేపట్టి చిన్నారులను గుర్తించాలని, షి టీం కళాశాల,పాఠశాల లో అవగాహాన కార్యక్రమాలు చేపట్టాలని ఇంచార్జి ఎస్సై కి సూచించారు.

రోజు రోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల సైబర్ వారియర్స్ ప్రజలకు మరింత అవగాహాన కల్పించాలని, ఫిర్యాదు అందిన వెంటనే కేసులు నమోదు చెయ్యాలని అన్నారు. నమోదు అయిన  సైబర్ నేరాలలో పుట్ ఆన్ హోల్డ్ చేసినా అమౌంట్ ను కోర్టు అనుమతి ద్వారా బాధితులకు అందజేయాలని అధికారులకు సూచించారు. పోలీస్ స్టేషన్ ల పరిధిలో పని చెయ్యని CC సిమెరాలను పునరుద్ధరించాలని, కమ్యూనిటీ పోలీసింగ్ లో బాగంగా మరిన్ని కొత్త కెమెరాల ఏర్పాటుకు ప్రజాలను ప్రోత్సహించాలని అన్నారు.

పోలీస్ స్టేషన్ లకు కొత్తగా వచ్చిన సిబ్బందికి ప్రజల తో ఎలా మాట్లాడాలో, ఎప్పుడైనా సమస్యలు తలెత్తినపుడు ప్రజలతో ఎలా వ్యవహరించాలో తెలుసుకునేలా వారికి స్వేచ్ఛను కల్పించాలని, తరచు గ్రామాలను సందర్శించేలా చేసి విధుల పట్ల అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. 

ఈ సమవేశం లో డి .ఎస్పి శ్రీ వై.మోగిలయ్య,  సాయుధ దళ డి.ఎస్పి నరేందర్ రావు, ఎస్బి ఇన్స్పెక్టర్ నాగేశ్వర రెడ్డి, గద్వాల్ ,ఆలంపూర్, శాంతి నగర్ సీఐ లు టి.శ్రీను, రవి బాబు, టాటా బాబు, ఆర్ ఐ. వెంకటేష్,  డీసీ ఆర్బీఎస్సై రజిత ఆయా పోలీస్ స్టేషన్ ల ఎస్సై లు తదితరులు పాల్గొన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State