ఆడపిల్ల పుట్టినప్పుడు లక్ష్మి పుత్రిక ఇంటికి వచ్చినట్లుగా భావించాలి

తళ్లమల్ల హసేన్

Mar 8, 2024 - 19:29
 0  4
ఆడపిల్ల పుట్టినప్పుడు లక్ష్మి పుత్రిక ఇంటికి వచ్చినట్లుగా భావించాలి

గృహ కార్మికుల యూనియన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట జిల్లా కోఆర్డినేటర్ కాస అనసూయ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధిగా ప్రముఖ న్యాయవాది మాలమహానాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు తళ్లమల్ల హసేన్ మాట్లాడుతూ మహిళలు లేనిది సృష్టి లేదని  అన్నారు. మహిళలు ఎంతో సహనంతో తమ ఇంటిని సమాజాన్ని ,సన్మార్గంలో నడిపించడంలో ముందు వరుసలో ఉన్నారని అన్నారు.ఆడపిల్ల పుట్టినప్పుడు లక్ష్మి పుత్రిక మన ఇంటికి వచ్చినట్లుగా భావించాలని,మనకున్న ఆస్తిలో కుమారులతో పాటు కుమార్తెలకు కూడా ఆస్తిలో సమభాగం ఇవ్వాలని, మన కోడళ్ళను మన కూతురు తో సమానం గా చూసుకోవాలని అన్నారు.ఇండ్లలో పని చేసే గృహ కార్మికులు సమస్యల పరిష్కారం కోసం గృహ కార్మికుల యూనియన్ తెలంగాణ స్టేట్ అన్నివేళల్లో ముందు వరుసలో ఉంటుందని అన్నారు. ఇళ్లల్లో పనిచేసే గృహ కార్మికులకు రక్షణ కల్పించే విధంగా పాలకులు చట్టాలు తీసుకురావాలని కోరారు. *కష్టాన్ని నమ్ముకుని ఇండ్లలో పని చేస్తూ జీవనం సాగించే గృహ కార్మికులను ప్రభుత్వం గుర్తించిప్రభుత్వం  ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని కోరారు. గృహ కార్మికులకు ప్రభుత్వం ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం మంజూరు చేస్తూ వారానికి ఒకరోజు సెలవు దినం ఇచ్చే విధంగా చట్టాలు తీసుకురావాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 10 లక్షల మంది గృహ కార్మికులు పనిచేస్తున్నారని వారి సమస్యలను ప్రభుత్వం త్వరగా పరిష్కరించాలని అన్నారు.వారి  పిల్లల చదువుల కోసం ప్రభుత్వం స్కాలర్షిప్ లను ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షురాలు పాల్వాయి సుహాసిని, ఉపాధ్యక్షురాలు అక్కినపల్లి పద్మ, జిల్లా కార్యదర్శి నిర్మల, చంద్రమ్మ, రాములమ్మ, జానమ్మ, నాగమ్మ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333