గత ప్రభుత్వ తప్పిదాల వల్లనే భూ సమస్యలు..

Jul 23, 2024 - 22:03
 0  30
గత ప్రభుత్వ తప్పిదాల వల్లనే భూ సమస్యలు..

ఆత్మహత్యాయత్నాలతో సమస్యలకు పరిష్కారం రాదు

పటేల్, పట్వారి వ్యవస్థ ఉంటే భూ సమస్యలు ఉండేవి కాదు

బాధితుల పక్షాన ఎప్పుడూ అండగా నేను నిలబడతా

విలేకరుల సమావేశంలో మాజీ రాజ్యసభ సభ్యులు మాజీ పీసీసీ అధ్యక్షులు వి. హనుమంతరావు

గత ప్రభుత్వాలు అవలంభించిన విధానాలు తప్పిదాల వల్లనే నేడు అనేకమంది రైతులు సామాన్య ప్రజలు భూ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని మాజీ రాజ్యసభ సభ్యులు,  మాజీ పిసిసి అధ్యక్షులు వి హనుమంతరావు అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రెడ్ హౌస్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నడిగూడెం మండలం రామాపురం గ్రామానికి చెందిన రైతు మేడం ముత్తయ్య కు వారసత్వంగా వచ్చిన భూమిని ఇతరులు కబ్జా చేయడం బాధాకరమన్నారు. రైతుకు వచ్చిన భూ సమస్య విషయంలో అప్పటి రెవెన్యూ అధికారులదే పూర్తి తప్పిదమన్నారు. బాధితుల నుంచి వివరాలు తెలుసుకునేందుకు తాను ఈరోజు గ్రామానికి వెళ్లానని వారితో మాట్లాడానని చెప్పారు. ధరణి లోపాలను అడ్డుపెట్టుకొని గత పాలకులు అధికారులు ఎన్నో పొరపాట్లు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు పట్టాదారులను కాదని అనర్హులకు పట్టాలు చేశారని అన్నారు. ధరణిని పూర్తి ప్రక్షాళన చేయ్యాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేయనున్నట్లు తెలిపారు. గతంలో పటేల్ పట్వారి వ్యవస్థ గ్రామాల్లో ఉన్నప్పుడు ఈలాంటి భూ సమస్యలు లేవని ఆ వ్యవస్థ రద్దు కావడంతో దానికి తోడు ధరణి రావడంతో అనేక భూ సమస్యలు పెరిగాయన్నారు. ఆత్మహత్యాయత్నాలు సమస్యలకు పరిష్కారాలు కావన్నారు. అన్యాయం ఎక్కడ ఉంటే అక్కడ నేనుంటానని సమస్యలు పరిష్కారం అయ్యే వరకు  బాధితుల పక్షాన తాను ఎల్లప్పుడూ అండగా నిలబడుత అన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333