హైదరాబాదులో జరిగే పి ఓ డబ్ల్యు రాష్ట్ర ఏడో మహాసభలను జయప్రదం చేయండి
హైదరాబాద్ లో జరిగే పి ఓ డబ్ల్యు రాష్ట్ర 7 వ మహాసభలను జయప్రదం చేయండి
కంచర్ల నర్సమ్మ,పిఓడబ్ల్యూ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శ
సూర్యాపేట, 15 ఆగస్టు 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- ప్రగతిశీల మహిళా సంఘం తెలంగాణ రాష్ట్ర ఏడోవ మహాసభలు నెల 31, సెప్టెంబర్ 1, 2న హైదరాబాదులో నిర్వహించనున్నట్లు దీనికి పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని పి ఓ డబ్ల్యు సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి కంచర్ల నరసమ్మ పిలుపునిచ్చారు
సూర్యాపేట జిల్లా కేంద్రంలో చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రం నందు మహాసభలను జయప్రదం చేయాలంటూ కరపత్రంnu ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పి ఓ డబ్ల్యు సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి కంచర్ల నర్సమ్మ పాల్గొని మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం మూడోదఫా అధికారులకు వచ్చాక కార్పొరేట్ అనుకూల విధానాలను చాలా స్పీడుగా అమలు చేస్తున్నారని అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను ధ్వంసం చేస్తూ, ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలకు కారు చౌకగా అమ్మేస్తున్నారని అందులో భాగంగానే బొగ్గు గనులను వేలం పాటలు నిర్వహించారని అన్నారు.బిజెపి ప్రభుత్వ హాయంలో మహిళలపై దాడులు, హింస అరికట్టడంలో వెనకబడ్డారని విమర్శించారు. రోజురోజుకు ప్రేమ పేరుతో విద్యార్థులపై, మహిళలపై హత్యాకాండలు కొనసాగుతున్నాయని దీనిపై పోరాటాలు నిర్వహించాలని అన్నారు. మహిళల కోసం కోసం అనేక చట్టాలు చేసిన ఉపయోగ లేకుండా పోతున్నాయని దుయ్యబట్టారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కరించాలని భవిష్యత్తు మహిళా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర 7వ మహాసభలు హైదరాబాదులో ఈనెల 31న బహిరంగ సభ,సెప్టెంబర్ 1,2న ప్రతినిధుల సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ సభలలో ఆహ్వాన సంఘం అధ్యక్షులు పద్మ శ్రీ శాంత సిన్హా, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ రమా మేల్కొటే, ఉమెన్ స్టడీస్ మేరీ జాన్, హక్కులనేత కల్పనా కన్నా బిరాన్, జర్నలిజం ఉస్మానియా ప్రొఫెసర్ పద్మజాశ, శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత, ఐ ఎఫ్ టి యు జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ అపర్ణ లాంటి మేధావులు ప్రసంగించనున్నారు.కావున పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు
*ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం పి ఓ డబ్ల్యు జిల్లా ఉపాధ్యక్షురాలు రామలింగమ్మ, కోశాధికారి జి. కావ్య, రమణ, దివ్య, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు*