జూపల్లి కృష్ణారావును కలిసిన శ్రీశైలం నిర్వహిహితులు

Aug 14, 2024 - 21:54
Aug 15, 2024 - 07:59
 0  54
జూపల్లి కృష్ణారావును కలిసిన శ్రీశైలం నిర్వహిహితులు

14-08-2024 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం.

 చిన్నంబావి మండల శ్రీశైలం నిర్వహిహితులు  ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు ని చిన్నంబావి మండల యువ నాయకుడైన  కొత్త కళ్యాణ్ రావు   కలవడం జరిగినది.

 మంత్రి జూపల్లి కృష్ణారావు వనపర్తి,నాగర్ కర్నూల్,గద్వాల  జిల్లాల కలెక్టర్ లకు ఫోన్ చేసి శ్రీశైలం నిర్వహితుల గురించి మాట్లాడటం జరిగింది.

 కలెక్టర్లకు మీరు తక్షణమే ప్రతి మండలఎమ్మార్వోలతో ప్రతి గ్రామం నిర్వాసితులను గుర్తించి 2000 లిస్టులో ఒరిజినల్ గా నిర్వాసితులు ఎవరో వెరిఫికేషన్ చేయించి లిస్టు తయారు చేసి, పది రోజుల లోపల నాకు పంపాలని మంత్రి జూపల్లి కృష్ణారావు కలెక్టర్లను చరవాణి ద్వారా చెప్పడం జరిగింది.

 కలెక్టర్లు కూడా స్పందించి కచ్చితంగా మేము పది రోజుల లోపు శ్రీశైల నిర్వహితుల లిస్టును మండల అధికారులతో గ్రామ గ్రామాల వారిగా వెరిఫికేషన్ చేయించి మీకు పంపుతాము అని హామీ ఇవ్వడం జరిగింది.

 మంత్రి జూపల్లి కృష్ణారావు పది రోజులలోపు ముగ్గురు కలెక్టర్లను పిలిపించి శ్రీశైలం నిర్వహితుల గురించి సమావేశం నిర్వహిస్తానాని చెప్పడం జరిగింది.

 ఈ యొక్క సమావేశంలో కొత్త కళ్యాణ్ రామ్, చిన్నంబాయి మండల అధ్యక్షుడు  శేఖర్ యాదవ్, చిన్నంబావి మండల తెలంగాణ వార్త రిపోర్టర్ విష్ణు సాగర్, బిక్కిం  డాగోజి, శేఖర్ యాదవ్, రాఘవేంద్ర శెట్టి, కాంత్ యాదవ్, నారాయణరెడ్డి, గోవిందు తదితరులు పాల్గొనడం జరిగింది..

Vishnu Sagar Chinnamabavi Mandal Reporter Wanaparthi District Telangana State