ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ వెంటనే అమలు చేయాలి
జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బాలెoలా పరశురాములు మాదిగ
అడ్డగూడూరు17 నవంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని ఎమ్మార్పీఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బాలేoల పరశురాములు మాదిగ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీ సాక్షిగా ఎస్సీలను ఏబిసిడి వర్గీకరణ తెలంగాణ ప్రభుత్వం ముందు అమలు చేస్తుందని దీని కొరకు ఎస్సి వర్గీకరణ కమిటీని వేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు.. తెలియజేస్తున్నానమని అన్నారు. ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ కమిషన్ రిపోర్ట్ వచ్చేవరకు ఉద్యోగ నియామకాలు చేపట్టొద్దని తెలియజేస్తున్నామని అన్నారు.ఒక వేళ ఉద్యోగ నియామకాలు చేపట్టినట్టయితే మాదిలకు త్రీవ అన్యాయం జరుగుతుందని అన్నారు. ఇది దృష్టిలో పెట్టుకొని ఎస్సీ వర్గీకరణ కమిటీ కాలయాపనం చేయకుండా వర్గీకరణ చేపట్టాలని లేనిచో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న నాయకత్వంలో మాదిగలం ప్రజా ఉద్యమాలు ఉద్రిక్త చేస్తామని అన్నారు