యువత స్వయం ఉపాధి పొందడం అభినందనీయం

యువత స్వయం ఉపాధి పొందడం అభినందనీయం యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయడం అభినందనీయమని సూర్యాపేట జిల్లా పాస్టర్ల అధ్యక్షుడు మీసాల గోవర్ధన్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో సోమవారం స్థానిక సూర్యపేట పోస్ట్ ఆఫీస్ రోడ్డు సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా కీర్తన ఎలక్ట్రికల్స్ ను ప్రారంభించి మాట్లాడారు వినియోగదారుల మన్ననలు పొందుతే వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిమల్ల శ్యాంసుందర్ నియోజకవర్గ అధ్యక్షులు జలగం డేవిడ్ రాజ్, రూరల్ అధ్యక్షులు జి సోలోమెన్ రాజు, పాస్టర్ విజయరాజ్, మీసాల సంధ్య, ప్రసన్న, శిల్ప, లక్ష్మి, ఉమా, మరియమ్మ, కోటేశ్వరి, నవిత, శివకుమార్, హరీష్, నాని, బాబు, సైదులు, రాజేష్,చంటి, జాన్ వెస్లీ, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.