బాలల హక్కుల పరిరక్షణకై సంతకాల సేకరణ జిల్లా కలెక్టర్
జోగులాంబ గద్వాల 8 నవంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల బాలల హక్కుల వారోత్సవాలలో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయంలో బాలల హక్కుల పరిరక్షణకై సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మొదటగా జిల్లా కలెక్టర్ బీ.ఎం. సంతోష్ సంతకం చేసి బాలలకు చదువుకునేందుకు స్వేచ్ఛాయుతమైన వాతావరణం కల్పించడం సామాజిక బాధ్యత అని అన్నారు. అదేవిధంగా బాలల హక్కుల పరిరక్షణ కోసం సమాజంలో ఉండే ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగ రావు, జెడ్పీ సీఈవో కాంతమ్మ, జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, సిడ్యాబ్లూసి మెంబెర్ జయభారతి, లేబర్ ఆఫీసర్ మహేష్, బీసీ ఎస్సీ వెల్ఫేర్ అధికారులు రమేష్ బాబు, సరోజ, ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ ప్రియాంక, స్పోర్ట్ ఆఫీసర్ ఆనంద్, డీసీపీఓ నరసింహ, సీడీపీఓలు హేమలత, సుజాత తదితరులు పాల్గొన్నారు