మా జీతాలు ఇఎంఐ లకే పోతున్నాయి మాకు న్యాయం చేయండి.
మా జీతాలు ఇఎంఐలకే పోతున్నాయి మాకు న్యాయం చేయండి
ఎస్బిఐ మెయిన్ బ్రాంచ్ మేనేజర్ చేతిలో మోసపోయిన పలు శాఖల ఉద్యోగుల ఆవేదన
ఎస్బిఐ మెయిన్ బ్రాంచ్ మేనేజర్ చేసిన మోసానికి తమ జీతం అంతా లోన్ ఈఎంఐ లకే పోతుందని పలు శాఖల ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తూ మంగళవారం ఎస్బిఐ మెయిన్ బ్రాంచ్ ముందు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ 2022 నుంచి సూర్యాపేట ఎస్బిఐ మెయిన్ బ్రాంచ్ లో బిఎంగా పనిచేసిన షేక్ సైదులు గతంలో బ్యాంకులో లోను తీసుకున్న పలు శాఖల ఉద్యోగులు 33 మంది పేరా తాను ఫోర్జరీ సంతకాలతో బ్యాంకు లోన్ తీసుకున్నాడన్నారు. సదరు బ్రాంచ్ మేనేజర్ షేకు సైదులు పర్సనల్ లోన్స్, టాప్ అప్ లోన్స్ పేరుతో ఉద్యోగుల పత్రాలు తీసుకొని అనంతరం ఉద్యోగులకు లోను రాదని చెప్పి అట్టి లోను తాను తన ఖాతాలో వేసుకున్నట్లు తెలిపారు.ఒక్క ఉద్యోగి నుంచి 15 నుంచి 25 లక్షల వరకు లోన్ తీసుకున్నట్లు తెలిపారు. 2023 జూన్ లో సదరు బ్రాంచ్ మేనేజర్ రామంతపూర్ ట్రాన్స్ఫర్ కాగా అక్కడ కూడా ఇలాగే చేస్తుండడంతో జనవరి 23న పట్టుబట్టడం జరిగిందన్నారు. అప్పటి వరకు తమ పేర తీసుకున్న బ్యాంకు రుణాలకు ఈఎంఐ లను సదరు బ్రాంచ్ మేనేజర్ సైదులు చెల్లించాడని తెలిపారు.తర్వాత ఆ లోన్లకు సంబంధించిన ఈఎంఐ లు తమ జీతాల నుంచి కట్ అవుతుండడంతో అనుమానం వచ్చి బ్యాంకులో సంప్రదించామన్నారు. అప్పుడు విషయం బయటకు రావడంతో బ్యాంకు రీజనల్ మేనేజర్ బ్రాంచ్ మేనేజర్ లను కలసి విషయం తెలిపినప్పటికీ తమకు న్యాయం జరగడం లేదన్నారు.గత సంవత్సర కాలంగా బ్యాంకు చుట్టూ తిరుగుతున్నామని మా జీతాల నుంచి బ్రాంచ్ మేనేజర్ తీసుకున్న లోన్లకు ఇఎంఐలు కట్టు అవుతుండడంతో వచ్చిన జీతం మొత్తం ఈఎంఐ లకే పోతుండడంతో కుటుంబాలు గడిచే పరిస్థితి లేదన్నారు. సదరు బ్రాంచ్ మేనేజర్ ను పోలీసులు ఇప్పటికే కస్టడీలో తీసుకున్నారని ఆయన కూడా తమ లోన్లు తీసుకున్నట్లు అంగీకరించాడని అయినప్పటికీ బ్యాంకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్నారు. ఇప్పటికైనా బ్యాంకు ఉన్నతాధికారులు స్పందించి మా ఉద్యోగుల జీతాల నుంచి బ్రాంచ్ మేనేజర్ తీసుకున్న లోన్ల ఈఎంఐ లను మినహాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.