విత్తన డీలర్స్ తో అవగాహన సదస్సు

Jun 1, 2024 - 17:55
 0  18
విత్తన డీలర్స్ తో అవగాహన సదస్సు

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ విత్తన డీలర్స్ తో అవగాహన సదస్సు అత్మకూర్ ఎస్.. రైతుల కు ఎవరు ఐనా కల్తీ విత్తనములు అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ ఐ సైదులు తెలిపారు. శనివారం ఆత్మకూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విత్తన షాపుల డీలర్స్ యజమానుల అవగాహన సదస్సు కు ముఖ్యంగా అతిథిగా పాల్గొని మాట్లాడారు.రైతులకు విత్తనములు కొనిన వెంటనే బిల్ ఇవ్వాల్సిందిగా సూచించారు.అలాగే రైతు వారీగా విత్తనములు అమ్మిన వివరాలు కొనుగోలు రిజిస్టర్ లో నమోదు చేయాల్సిందిగా సూచించారు. అనంతరం మండల వ్యవసాయ అధికారి దివ్య తమ సిబ్బంది తో కలిసి ఆత్మకూర్ భారతి ఏజెన్సీ, మరియు ఏపూర్ లోని విత్తన దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేసి ఇన్వాయిస్ ,స్టాక్ రిజిస్టర్, లను పరిశీలించారు.ఈ కార్యక్రమం లో మండల వ్యవసాయ అధికారి దివ్య , విత్తన డీలర్స్ సుధాకర్ రెడ్డి, వినయ్,పూల్ సింగ్,విష్ణు వర్ధన్ రెడ్డి, నరేందర్ రెడ్డి ఇతర డీలర్స్ పాల్గొన్నారు.