బీర్ల కొరత ఆందోళనలో మద్యం ప్రియులు

తిరుమలగిరి 7 మే 2024 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంతో పాటు మండలంలో నీ వివిధ గ్రామాల్లో గత 20 రోజులుగా మద్యం షాపులలో బీర్లు సరఫరా చేయకపోవడం మూలంగా వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు మున్సిపల్ కేంద్రంలో ఉన్న మద్యం షాపులు బార్లలో బీర్ల సరఫరా సక్రమంగా లేకపోవడం మూలంగా ఎండాకాలం ఎండలు మండిపోతు0డడం తో మద్యం ప్రియులు బిర్ల కోసం ఎగబడుతున్నారు మున్సిపల్ కేంద్రంతో పాటు మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ఉన్న బెల్టు షాపులో కూడా బీర్లు దొరకకపోవడంతో ఆయా గ్రామాల్లో ఉన్న మందు ప్రియులు బీర్ల కోసం ఆరాటపడుతున్నారు గత కొన్ని రోజులుగా ఎండలు విపరీతంగా కొట్టడంతో చల్లదనం కోసం వివిధ గ్రామాల నుండి వచ్చే మద్యం ప్రియులతో పాటు వివాది శుభకార్యాలకు వచ్చే వారు కూడా వైన్ షాపులతోపాటు బెల్ట్ షాపులలో బీర్ల కోసం ఎగబడుతున్నారు దీంతో వారు సమాధానం చెప్పలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం మద్యం అమ్మకాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఎండాకాలంలో అమ్మ కాలు పెరుగుతుండడంతో అమ్మకాలకు తగ్గట్టుగా తయారీ లేకపోవడం వైన్ షాప్ యజమానులు బీర్లు కోసం ఆర్డర్లు పెట్టిన సంబంధిత లిక్కర్ యజ మానులు పంపకపోవడంతో మద్యం ప్రియులు వైన్ షాప్ లో నిలదీస్తున్నారు ఎండాకాలం మద్యం విక్రయలకు అనుకూలంగా బీర్లను సరఫరా చేస్తే తమకు ఇబ్బందులు ఉండవని యజమాను తెలిపారు.దీంతో యజమానులు సమాధానం చెప్పలేక పోతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం బీర్ల తయారీతో పాటు సరఫరాను పెంచాలని కోరుతున్నారు