ఎల్ ఆర్ ఎస్ నిబంధనలను సవరించాలి
అధికారుల అలసత్వం వల్లే ప్రొహిబిటెడ్ జాబితాలో ప్రైవేట్ భూములు
సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్
సూర్యాపేట టౌన్,ఏప్రిల్ 12 :- రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ నిబంధనలను సవరించి ప్రతి ఒక్కరూ ఎల్ఆర్ఎస్ చేయించుకునేలా మార్గదర్శకాలు విడుదల చేయాలని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రం నుండి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎల్ఆర్ఎస్ చేసుకునేందుకు బఫర్ జోన్ ను 30 మీటర్ల నుండి 200 మీటర్ల వరకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వల్ల ఎన్నో ఏళ్ల క్రితం స్థలాలు కొనుక్కున్న వాటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం ఎల్ ఆర్ ఎస్ పై పునర్ ఆలోచించి పాత నిబంధనలను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఎల్ఆర్ఎస్ ప్రజలకు పెనుబారంగా మారిందని ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. గతంలో ఆన్లైన్లో ప్లాట్ లకు ఎల్ ఆర్ ఎస్ కోసం 10,000 రూపాయలు చెల్లించిన నేడు ఆన్లైన్లో ఆప్షన్లు లేకపోవడంతో ఎంతోమంది తీవ్ర మనోవేదన గురవుతున్నారన్నారు. గతంలో రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు, నీటిపారుదల శాఖల అధికారులు, అలసత్వం సమన్వయ లోపం తో పట్టా భూములు అయినప్పటికీ ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, ఎఫ్ టి ఎల్ పరిధిలో ఉన్నాయంటూ ఆన్లైన్లో పొరపాటుగా నమోదు చేశారు. వారి తప్పిదం వల్లనే నేడు చాలామంది ప్లాట్ యజమానులు తలలు బాదుకుంటున్నారు. రాయితీ రాకున్నప్పటికీ పూర్తి ఫీజు చెల్లించేందుకు కొందరు సిద్ధంగా ఉన్నప్పటికీ ఆన్లైన్లో తప్పుగా నమోదు కావడంతో ఎల్ ఆర్ ఎస్ నోచుకోవడం లేదు. అని వీరస్వామి గౌడ్ చెప్పుకొచ్చారు. ప్రభుత్వ అధికారుల తప్పిదం వల్లనే ఆన్లైన్ లో ప్రైవేటు భూములు కూడా నిషేధిత భూముల జాబితాలో రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వివరించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జీవోను సవరించాలని కోరారు. 2020 నుంచి 2024 వరకు పట్టా పాస్ బుక్ నుంచి రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్ల కు ఎల్ ఆర్ఎస్ కట్టుకునేలా ప్రభుత్వం అవకాశం కల్పించాలి అని పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. ప్రస్తుతం ఎల్ఆర్ఎస్ ఆన్లైన్ లో సర్వర్ మోరయించడంతో గంటల తరబడి ప్రజలకుఎదురుచూపులు తప్పడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి జిల్లా కోశాధికారి పాల సైదులు జిల్లా కార్యదర్శి ఖమ్మం పాటి అంజయ్య గౌడ్ పట్టణ కార్యదర్శి బానోతు జానీ నాయక్ పట్టణ కార్యదర్శి గిరీశం అయితే గాని మల్లయ్య గౌడ్ ఆకుల మారయ్య గౌడ్ పట్టేటి కిరణ్ పట్టణ సహాయ కార్యదర్శి సారంగ కోటేష్ అవినాషూ తదితరులు పాల్గొన్నారు.