రైతులు ఆందోళన చెందవద్దు మండల వ్యవసాయ శాఖ

తిరుమలగిరి 15 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
అన్నదాతలపై ప్రకృతి పగబట్టింది. సగం పంటలు సాగునీరు అందక ఎండిపోగా, మరికొంత పంట వడగండ్ల వానతో పంట పొలంలోనే ధాన్యం రాలిపోయింది. అష్టకష్టాలు పడి పండించిన ధాన్యం ఆదివారం ఆరబెట్టగా.. అకాల వర్షం రావడంతో మొత్తం తడిసి ముద్దయింది. తిరుమలగిరి మండల తొండ గ్రామంలోని ఐకెపి కేంద్రాన్ని సందర్శించిన వ్యవసాయ మండల అధికారి నాగేశ్వరరావు మరియు మండల విస్తరణ అధికారి వెంకటేశ్వర్లు రైతులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ , రైతులు ధాన్యాన్ని ఆరబెట్టి తూర్పారపట్టిన ఎడల నష్టం వాటిల్లకుండా ఉండే అవకాశం ఉంది. కల్లాలకు తరలించి, తూకంలో జాప్యం కారణంగా అకాల వర్షాలకు ధాన్యం తడిస్తే ప్రభుత్వపరంగా పూర్తి బాధ్యత వహిస్తాం. వర్షాలకు తడిసిన ధాన్యానికి మ్యాచర్ గ్రేడును బట్టి పూర్తి స్థాయి ధరలు చెల్లించి కొనుగోలు చేస్తాం. ఈ విషయంలో రైతులు ఎలాంటి అభద్రతా భావానికి లోను కావలసిన అవసరం లేదు. రైతు పండించిన ధాన్యాన్ని , వెంటనే బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలిస్తాం. ఏదైనా సమస్య తలెత్తితే సమాచారం ఇస్తే తక్షణమే స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటాం. తెలిపారు ఈ కార్యక్రమంలో ఐకెపి నిర్వాహకులు తెరాటి వెంకన్న గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు....