ప్రశ్నించే గొంతును పార్లమెంటుకు పంపండి
తిరుమలగిరి 7 మే 2024 తెలంగాణ వార్త రిపోర్టర్
భువనగిరి పార్లమెంటు ఎన్నికలలో ప్రశ్నించే గొంతులకు పట్టం కట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు అన్నారు. సోమవారంమండల పరిధిలోని జలాల్ పురం, రాఘవాపురం గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ మోడీ పదేళ్ల కాలంలో బూటకపు వాగ్దానాలు చేసి ప్రజలపై మోయరాన్ని భారాలు మోపిందని దళితులు గిరిజనులు ఆదివాసీల పైన ఉక్కు పాదం మోపిందని దళిత మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అత్యాచారాలు జరిపిన వారికి దండలేసే సంస్కృతి కాషాయం ఒకలకే చెల్లిందని అన్నారు అవకాశవాద పార్టీలైన బిజెపి టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలను ఓడించి సిపిఎం అభ్యర్థి మహమ్మద్ జహంగీర్ కు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపైన అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో సామాజిక అంశాలపై సిపిఎం రాజీలేని పోరాటాలు నిర్వహించిందని,దళితుల పక్షాన నికరమైన పోరాటాలుసిపిఎం నిర్వహించిందన్నారు. రాష్ట్రంలో అంటరానితనము కుల నిర్మూలన కోసం రాజీలేని పోరాటాలుసిపిఎం నిర్వహిస్తామని ఈ ఎన్నికల్లో భారత రాజ్యాంగాన్ని తొలగించే కుట్రల నుండి తిప్పికొట్టాలని అంటే సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ గెలుపు అనివార్యమని అన్నారు. సిపిఎం పార్టీ పోరాటాల ద్వారా వచ్చిన ఉపాధి హామీ చట్టం పేదలకు ఎంతో మేలు చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి గుమ్మడవెల్లి ఉప్పలయ్య, కెవిపిఎస్ రాష్ట్ర నాయకులు కొమ్ము విజయ్ కుమార్, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం రాంబాబు, సిపిఎం మండల కమిటీ సభ్యులు కడెం లింగయ్య, వనం సోమయ్య, కొమ్ము నాగార్జున, బిక్షమాచారి తదితరులు పాల్గొన్నారు.