సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు .
జోగులాంబ గద్వాల 8 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి: ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే విజయుడు హాజరై లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులు సకాలంలో బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవాలని అలంపూర్, ఉండవెల్లి,మానవపాడు మండలాలకి చెందిన సీఎంఆర్ఎఫ్ 71 మంది లబ్ధిదారులకు 17 లక్షలు రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.