ఎవరైన మొబైల్ పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన వెంటనే CEIR పోర్టల్ నందు నమోదు చేసుకోవాలి
- మొబైల్ ఫోన్ పోయిన, చోరికి గురైనా www.ceir.gov.in (CEIR ) అప్లికేషన్ నంధు నమోదు చేసుకోవాలి.
- జిల్లా పరిధిలో పోగొట్టుకున్న, చోరికి గురైన సుమారు 22 లక్షల విలువగల 111 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేయడం జరిగినది.
- 10 రోజుల వ్యవదిలోనే మా సిబ్బంది బాగా పని చేసి 111 మొబైల్స్ ను రికవరీ చేశారు.
- జిల్లాలో గత రెండు సమవత్సరాల్లో 2238 మొబైల్స్ పోయినట్లు CEIR పోర్టల్ నందు పిర్యాధులు వచ్చాయి వీటిల్లో 61 % తో 1362 ఫోన్లను రికవరీ చేసి బాధితులకి అందజేయడం జరిగింది.
- జిల్లా పోలీసు ప్రజల భద్రతలో కృతనిచ్చయంతో పని చేస్తుంది.
- డిజిటల్ అరెస్ట్ అంటూ ఎవరైనా ఫోన్ చేస్తే నమ్మవద్దు, డిజిటల్ అరెస్ట్ అనేది అబద్దం.
- ప్రస్తుతం మొబైల్ ఫోన్ అనేది నిత్యావసరమైనది, సైబర్ మోసాలు మొబైల్ కేంద్రంగా జరుగుతాయి, ఫోన్ వినియోగించడంలో జాగ్రత్తలు పాటించాలి.
- మొబైల్ పోతే వెంటనే CEIR పోర్టల్ నంధు నమోదు చేసి ఫోన్ బ్లాక్ చేసుకోవాలి, పోలీసులకు పిర్యాధు చేయాలి.
కె.నరసింహ ఐపీఎస్, ఎస్పి సూర్యాపేట జిల్లా.
శనివారం రోజున జిల్లా పోలీస్ కార్యాలయంలో సెల్ ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేసి జిల్లాలో గత కొన్ని రోజుల నుండి వివిధ రూపాల్లో పోగొట్టుకున్న సుమారు 22 లక్షల రూపాయల విలువ గల 111 ఫోన్ల ను గుర్తించి రికవరీ చేసి జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్ చేతుల మీదుగా సంబంధిత మొబైల్ ఫోన్ల యజమానులకు (భాదితులకు) అందజేయడం జరిగింది. అధనపు ఎస్పీ నాగేశ్వరావుతో కలిసి బాధితులకు మొబైల్స్ అందించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ....
ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరికీ నిత్యవసరమైనది, దీనిని కమ్యూనికేషన్ కోసం, ఆన్లైన్ విద్య కోసం వినియోగిస్తున్నాం, మన యొక్క విలువైన సమాచారం బ్యాంక్ అకౌంట్స్, పాస్ వర్డ్స్, సోషల్ మీడియా అకౌంట్స్, వ్యక్తిగత ఫోటోలు మొదలైన వంటివి ఫోన్ లో నిక్షిప్తం చేసుకుంటున్నాము అన్నారు, మొబైల్ చోరికి గురైనా, పోగొట్టుకున్నా అందులో ఉన్న సమాచారం పోతుంది. నేరగాళ్లు మొబైల్ దొంగిలించి, వీక్ పాస్ వర్డ్స్ లను బ్రేక్ చేసి ఫోన్ పే, గూగుల్ పే తదితర మద్యమాల ద్వారా డబ్బులు కాజేస్తున్నారన్నారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తులు కేవలం మొబైల్ ఫోన్ మాత్రమే కాకుండా తమ వ్యక్తిగత సమాచారంతో సహ డబ్బులను కూడా కోల్పోవడం జరుగుతుందన్నారు. సెల్ ఫోన్ దొంగతనాల నుండి విముక్తి కల్పించడానికై DOT (డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీ-కమ్యూనికేషన్) CEIR పోర్టల్ ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, ఈపోర్టల్ ద్వారా మంచి ఫలితాలు రాబట్టడం జరుగుతుందని ఎస్పీ వివరించారు. ఎవరైన మొబైల్ పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన వెంటనే CEIR పోర్టల్ ( https://www.ceir.gov.in ) నందు నమోదు చేసుకోవాలి, మొబైల్ ను బ్లాక్ చేసి, మీ సేవా ద్వారా ధరఖాస్తు సంభందిత పోలీసు స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజలు, వినియోగదారులు ఎవరైనా సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్ లను కొనుగోలు చేసినట్లైతే అట్టి షాప్ యజమాని నుండి రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. సెల్ ఫోన్ దొంగలు దొంగిలించిన ఫోన్ లను మొబైల్ షాప్ లలో అమ్ముతున్నారని, తక్కువ ధరకు వస్తుందని దొంగిలించబడిన ఫోన్ అని తెలియక కొనుగోలు చేసి అమాయక ప్రజలు మోసాలకు గురి అవుతున్నారని అన్నారు. ఎవరైన దొంగిలించబడిన ఫోన్ అని తెలిసి కూడా కొనుగోలు చేసినట్లైతే అట్టి వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో 2024, 2025 రెండు సంవత్సరాల కాలంలో సీఈఐఆర్ పోర్టల్ ద్వారా 2238 ఫోన్లు పోయినట్లు పిర్యాధులు వచ్చాయి వీటిల్లో జిల్లా పోలీసు 1362 ఫోన్లును గుర్తించి సబంధిత మొబైల్ ఫోన్ల యజమనులకి అందించడం జరిగిందని, జిల్లాలో ఫోన్ల 61 % తో రికవరీ చేసి బాధితులకు అప్పగించడం జరిగిందన్నారు. పోలీసు శాఖ కృత నిచ్చాయంతో పని చేసి ఈరోజు పెద్దమొత్తంలో ఫోన్స్ రికవరీ చేసి ఇక్కడ భాదితులకు అందించ్డమ్ జరిగినది అన్నారు.
ప్రజలు అత్యాసకు పోయి సైబర్ మోసాల బారిన పడోద్దు తక్కువ వడ్డీకి లోన్స్ ఉన్నాయి, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు, బహుమతులు వచ్చాయి అంటే నమ్మి అపరిచితులకు డబ్బులు పంపవద్దు, వ్యక్తిగత వివరాలు చెప్పవద్దు, మీ పిల్లలు డ్రగ్స్, అమ్మాయిల రవాణా లాంటి కేసుల్లో చిక్కుకున్నారు డిజిటల్ అరెస్ట్ చేస్తాం అని CBI, CID లాంటి దర్యాప్తు సంస్తల పేర్లు చెప్పి డబ్బులు కడితే కేసు నుండి తప్పిస్తాము అంటారు ఇది నమ్మవద్దు డిజిటల్ అరెస్ట్ అబద్దం అన్నారు. పోలీసు మీకోసం ఉన్నారు, ప్రజా భద్రతలో అనుక్షణం కృషి చేస్తున్నాము, మీ ప్రాంతాల్లో జరుగుతున్న అశాంఘిక చర్యలు, అక్రమ రవాణా పై పోలీసుకు సమాచారం ఇవ్వాలి, సమాజంలో జరుగుతున్న అసాంఘిక చర్యలు, అక్రమాలు, అక్రమ రవాణా లాంటి వాటిపై ప్రశ్నించే ప్రతిఒక్కరు యూనిఫాం లేని పోలీసు, వీటిపై మాకు సమాచారం ఇవ్వండి మీ వివరాలు గోప్యంగా ఉంచుతాం అన్నారు, ప్రజలు పోలీసులకు మిత్రులుగా ఉంటూ నేరాల నివారణలో భాగస్వామ్యం కావాలి అన్నారు. జిల్లాలో వివిధ రూపాల్లో వినియోగదారులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్స్ ను CEIR అప్లికేషన్ ద్వారా రికవరీ చేసి బాధితులకు అప్పగించడంలో కృషి చేస్తున్న ఐ.టి కోర్ సిబ్బందిని, పోలీస్ స్టేషన్ సిబ్బందిని జిల్లా ఎస్పీ గారు అభినందించారు. పోయిన మొబైల్ ఫోన్లు మళ్లీ దొరకదనుకున్న బాధితులు జిల్లా పోలీసులు టెక్నాలజీ ఉపయోగించి ఫోన్ రికవరీ చేసి అందించినందుకు సంభందిత బాధితులు జిల్లా ఎస్పీ కి, పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నాగేశ్వరావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నాగబుషణ రావు, IT కోర్ ఆర్‌ఎస్‌ఐ రాజశేఖర్, ఐటి కోర్ సిబ్బంది, మొబైల్ పోగొట్టుకున్న బాధితులు ఉన్నారు.