*బిసి సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొండిల్ల శ్రీనివాస్ నియామకం*
*బిసి సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొండిల్ల శ్రీనివాస్ నియామకం*
మంచిర్యాల,సెప్టెంబర్ 09 (తెలంగాణ వార్త):
జాతీయ బిసి సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా పట్టణానికి చెందిన కొండిల్ల శ్రీనివాస్ నియామకం అయ్యాడు. ఈ సందర్బంగా శ్రీనివాస్ కు నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతు నా పై నమ్మకం తో సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నందుకు జాతీయ అధ్యక్షులు గాజుల శ్రీనివాస్,రాష్ట్ర అధ్యక్షులు బైరి రవికిష్ణ, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుల్కచర్ల శ్రీనివాస్,రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ నీలకంఠేశ్వరరావు, డాక్టర్ ఉదారి చంద్రమోహన్ గౌడ్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం మందమర్రి పట్టణ కమిటీ అధ్యక్షునిగా చేసిన కార్యక్రమాలకు నాలుగు సంవత్సరాలుగా సహకరించిన కమిటీ సభ్యుల సహకారం, ప్రత్యేకంగా మీడియా మిత్రుల తోడ్పాటు మరువలేనిదని అన్నారు. బి సి ల సంక్షేమమే లక్ష్యంగా తన వంతు కృషి చేస్తానని అన్నారు.