కార్మికుల హక్కులను కాలరాస్తున్న మోడీ ప్రభుత్వం తాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా

Jul 10, 2024 - 18:40
Jul 10, 2024 - 19:49
 0  42
కార్మికుల హక్కులను కాలరాస్తున్న మోడీ ప్రభుత్వం తాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా

కార్మికుల హక్కులను కాలరాస్తున్న మోడీ ప్రభుత్వం తాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు రణపంగ కృష్ణ

పెన్ పహాడ్ తెలంగాణ వార్త: పెన్ పహాడ్ మండల కేంద్రంలో కార్మికుల కోర్కెల దినోత్సవం సందర్భంగా కేంద్రంలో తాసిల్దార్ ఆఫీస్ ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది ఈ సందర్భంగ సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు రణపంగ కృష్ణ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చింది గత అది సంవత్సరాలుగా సాగించిన ప్రైవేటీకరణ విధానాలను ఏగవంతం గా అమలు చేసేందుకు మళ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే నాలుగు లేబర్ కోడ్ లను అమలు చేస్తామని బిజెపి ప్రభుత్వం ప్రకటించింది బొగ్గు బ్లాకులు వేలానికి పూనుకొని ఈపీఎఫ్ సహకాలంలో చెల్లించని యజమానులకు విధించే జరిమానా భారీగా తగ్గించి ది కార్పొరేట్ మతోన్మాదులను ప్రసన్నం చేసుకొని వారికి లాభాలు కట్టబెట్టినందుకు నిర్వర్చంగా ఉంది కేంద్ర బిజెపి విధానాలను నివారించి కార్మికుల హక్కులను కాపాడేందుకు దేశవ్యాప్తంగా కార్మిక పోరాటాలను ఉదృతం చేయాలని సిఐటియు అఖిల భారత కమిటీ నిర్ణయించింది దేశవ్యాప్తంగా జులై 10న జిల్లా మండల కేంద్రాల్లో కార్మికుల కోర్కెల దినం పాటించాలని పిలుపునిచ్చింది ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో జులై 10 నా మండల కేంద్రంలో ధర్నా చేయాలని పిలుపునిచ్చింది పిలుపులో భాగంగా మండల కేంద్రంలో తాసిల్దారు ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి తాసిల్దార్ కు వివిధ డిమాండ్ల తో కూడిన వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి గుంజా వెంకటేశ్వర్లు .జిపి వర్కర్స్ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ధనియాకుల శ్రీనివాస్. నాయకులు నగరికటి నరసయ్య .ఒగ్గు మట్టయ్య. ఎల్లమ్మ. సత్తమ్మ.తదితరులు పాల్గొన్నారు

Harikrishna Penpahad Mandal Reporter Suryapet Dist Telangana State