నవరాత్రోత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో గణేష్ ని పూజించాలి

Sep 11, 2024 - 09:22
 0  4
నవరాత్రోత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో గణేష్ ని పూజించాలి

*నవరాత్రోత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో గణేష్ ని పూజించాలి*

-రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ 

-అంజనీపుత్ర ఎస్టేట్స్ చైర్మన్ ఎండి గుర్రాల శ్రీధర్,పిల్లి రవి

మంచిర్యాల ప్రతినిధి, సెప్టెంబర్ 09 (తెలంగాణ వార్త):

ఆధ్యాత్మిక వాతావరణం లో గణేషుని పూజలు నిర్వహించుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ పేర్కొన్నారు..సోమవారం జిల్లా కేంద్రంలో ని చున్నం బట్టి వాడ లో అంజనీ పుత్ర రియల్ ఎస్టేట్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ గణేష్ నవరాత్రోత్సవాలు పూజలు ఆధ్యాత్మిక వాతావరణంలో, ప్రభుత్వ సూచనలకనుగుణంగా కొనసాగాలన్నారు. రియల్ ఎస్టేట్స్ సంస్థ చైర్మన్ గుర్రాల శ్రీధర్ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు గణేషుని ఆశీస్సులు కలగాలని కోరుతూ ఈ సంవత్సరం 14 అడుగుల విగ్రహం ఏర్పాటు చేశామని, లక్కీ డ్రా ద్వారా 111 కిలోల ఉచిత లడ్డూవితరణ,నిత్యాన్నదానం తదితర ఏర్పాట్లు భక్తులకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశామన్నారు.ఈ కార్య క్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాష్, సీఐలు బన్సిలాల్, అశోక్ అంజనీపుత్ర ఎండీ పిల్లి రవి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సూరినేని కిషన్, సదానందం, డెరైక్టర్ లు తదితరులు పాల్గొన్నారు.

Pilli Ravikiran Mancherial Staff Reporter