ఉత్తరప్రత్యుత్తరాల్లో సమాచార హక్కు చట్టం 2005 'లోగో' ఉండాలి

రాష్ట్ర అధ్యక్షులు కొర్ర. కిషన్ నాయక్ 

May 3, 2024 - 22:01
 0  10
ఉత్తరప్రత్యుత్తరాల్లో సమాచార హక్కు చట్టం 2005 'లోగో' ఉండాలి
ఉత్తరప్రత్యుత్తరాల్లో సమాచార హక్కు చట్టం 2005 'లోగో' ఉండాలి

తెలంగాణవార్త డిండి మండల ప్రతినిధి:- సమాచార హక్కు చట్టానికి బహుళ ప్రచారం కల్పించి ప్రజల చెంతకు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం సమాచార హక్కు చట్టంపై ఓ చిహ్నం (లోగో )కు రూపాకల్పన చేసింది. దేనికి విశేష ప్రచారం కల్పించడం ద్వారా సామాన్యుడు అవసరమైన సమాచారంతో పాటు పాలనలోని లోటుపట్లను ఎత్తి చూపించే అవకాశాలను ఇవ్వాలని భావించి లోగోను రూపొందించింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు  (డీవోపీటీ ఓఎం నెం. ఎఫ్ 1/13/2010-ర్ తేది :24-1-2011, ఏపీ ప్రభుత్వ సరుక్యులర్ యు.వో.నోట్ నెం.5332/జీపీఎం&ఏఆర్/2011 తేది : 19-10-2011)జారీ చేసింది. అధికార యంత్రంగం చేయు ఉత్తర ప్రత్యుత్తరలాన్నింటిలో సమాచార హక్కు చట్టం లోగోను తప్పనిసరిగా వినియోగించాలని ఆ ఆదేశాల్లో స్పష్టంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేర్కొన్నాయి.వ్యక్తిగత, ప్రజాసమస్యల పరిష్కారం కోసం, సలహాలు సూచనలు కోసం సంప్రదించవలసిన ఫోన్ నెం. FWO RTI రాష్ట్ర అధ్యక్షులు కొర్ర. కిషన్ నాయక్,9885122005 తెలియపర్చుతాను

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333