అర్ధరహితమైన ఆరోపణలు చేయడం మానుకోవాలని

Aug 22, 2024 - 09:20
Aug 22, 2024 - 09:25
 0  23
అర్ధరహితమైన ఆరోపణలు చేయడం మానుకోవాలని

కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పై చేసిన అర్ధరహితమైన ఆరోపణలు చేయడం మానుకోవాలని తెలంగాణ ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయపూడి వెంకటనారాయణ, జిల్లా రైతు సమన్వయ సమితి మాజీ సభ్యురాలు స్వరాజ్యలక్ష్మి  అన్నారు. బుధవారం పట్టణo నిర్వహించిన విలేకరులసమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన అండగా నిలబడుతుంటే, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకు వెళుతుంటే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ పబ్బం గడుపుతున్నాయని విమర్శించారు. కోదాడలో సైతం ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి నియోజకవర్గన్ని వందల కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేస్తుంటే, కావాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్  పసలేని ఆరోణలు చేస్తున్నారని  అన్నారు. కోదాడలో ఎమ్మార్పీ కంటే 15 రూపాయలు ఎక్కువగా లిక్కర్ అమ్ముతున్నారని కాంగ్రెస్ నాయకుల పై అసత్య ఆరోపణలు  చేయడం కాదని ఎక్కడ అమ్ముతున్నారో నిరూపించాలని ఆయన సవాల్   విసిరారు.

 నీ హయాంలో 200 రూపాయల టోకెన్ ఇచ్చి మట్టి తోలుకొన్న రోజులను ప్రజలు ఇంకా మరిచి పోలేదని అన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇస్తా అని దళిత మహిళ దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేయడం, రెవెన్యూ పోలీస్ వివిధ వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకుని దందాలు చేసింది నిజం కాద అన్నారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ప్రతి పనిలో అవినీతి రాజ్యమైలిందన్నారు. అందుకే ప్రజలు కాంగ్రెస్కు ఓటు వేసి ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిని 58 వేల  భారీ మెజార్టీతో గెలిపించారని పేర్కొన్నారు. నియోజకవర్గంలో తన పేరు మసకబారి పోతుందేమోనని ఉద్దేశంతో ఆరోపణలు చేసి హడావుడి చేయాలనుకోవడం తప్ప ఇందులో ఎటువంటి వాస్తవాలు లేవన్నారు.కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే తప్పదని, రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసి మాట నిలుకుందాని అన్నారు.

 రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని రైతులందరికీ గడువులోగా ఏకకాలంలో రూ.2లక్షల వరకు రుణమాఫీ చేయాలని తీసుకుర్ణ నిర్ణయం హర్షణీయమని ఆయన  అభివర్ణించారు. రుణమాఫీతో నియోజకవర్గంలో చాలా కుటుంబాలకు మేలు జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పదన్నారు. గతంలో కూడా ఒకేసారి రుణమాణీ చేసిన ఘనత కాంగ్రెస్‌కు దక్కుంతుందన్నారు. తాజాగా తీసుకున్న నిర్ణయంతో రైతులు అందరూ సంతోషంగా ఉన్నారని అన్నారు.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State