భీమిరెడ్డి నరసింహారెడ్డి పోరాట ఫలితమే శ్రీరాంసాగర్ రెండవ దశ సాధన.

Oct 21, 2025 - 17:34
Oct 21, 2025 - 17:39
 0  2
భీమిరెడ్డి నరసింహారెడ్డి పోరాట ఫలితమే శ్రీరాంసాగర్ రెండవ దశ సాధన.
భీమిరెడ్డి నరసింహారెడ్డి పోరాట ఫలితమే శ్రీరాంసాగర్ రెండవ దశ సాధన.

ముఖ్యమంత్రి ప్రకటనను వెనుకకు తీసుకుని కాలువకు బి.యన్.రెడ్డి పేరు నామకరణం చేయాలి.

ఎం సి పి ఐ యు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వరికుప్పల వెంకన్న విజ్ఞప్తి

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు కృష్ణ గోదావరి నది జలాల అను సంధానకర్త భారత రాష్ట్రపతి అవార్డు గ్రహీత సామాజిక న్యాయ రథసారథి విప్లవాల ఎర్ర సూర్యుడు కరివిరాల కొత్తగూడెం ఎర్రజెండా ముద్దుబిడ్డ శ్రీరాంసాగర్ రెండవ దశ సాధన సాధించిన పోరాటాల భీముడు ఎం సి ప ఐయు పోలిటి బ్యూరో సభ్యులు అమర జీవి కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి మాజీ పార్లమెంట్ సభ్యులు పేరును శ్రీరామ్ సాగర్ రెండవ దశ కాలువకు నామకరణం చేయాలని ఎంసిపిఐయు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వరికుప్పల వెంకన్న ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బి.యన్ రెడ్డి సాయుధ పోరాటం నుండి మొదలుకొని రెండుసార్లు ఎమ్మెల్యేగా మూడుసార్లు ఎంపీగా 25 సంవత్సరాలు ప్రజా ప్రతినిధిగా ఎన్నికై చట్టసభలలో ప్రజల పక్షాన ప్రాతినిధ్యం వహించి తన యొక్క కంచు కంఠాన్ని అసెంబ్లీ పార్లమెంటులో వినిపించి ప్రజలకు సాగునీరు తాగునీరు అందించాలని పరితపించి ప్రజా ఉద్యమాలను నిర్మించి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టించి కాల్వ కోసం బడ్జెట్ కేటాయింపు చేసి కేంద్ర జల వనరుల శాఖ మంత్రి చే కాలువను సర్వే చేయించి అధికారులతో చర్చలు జరిపి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి 1996 మార్చి ఆరో తారీఖున ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మిర్యాలగూడ ఎంపీగా ఉన్న బి.యన్.రెడ్డి స్వయంగా దగ్గర ఉండి తుంగతుర్తి నియోజకవర్గ తిరుమలగిరి మండల ప్రగతి నగర్ పనిగిరి వద్ద స్వయంగా దగ్గర ఉండి కాలువకు శంకుస్థాపన చేయించిన వీరుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి1999 సంవత్సరము దామోదర్ రెడ్డి శిలాఫలకం వద్ద రక్త తర్పణం చేశారని వెంకన్న గుర్తు చేశారు ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రులతో నీటిపారుదల శాఖ మంత్రులు కడియం శ్రీహరి పొన్నాల లక్ష్మయ్య తో అనేకసార్లు చర్చలు జరిపి ఉత్తరాలు రాసి మైలారం స్టేజి వద్ద మండుటెండలు సదస్సులు రాస్తారోకోలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి గోదావరి నీరు చూసి తీరుతానని పరితపించి 2008 మే 9 వ తేదీన మరణించారని మే 16న సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన బి.ఎన్.రెడ్డి సంతాప సభలో ఆనాటి హోంశాఖ మంత్రి జానారెడ్డ మాజీ మంత్రి దామోదర్ రెడ్డి ప్రభుత్వం తరఫున ఎస్సారెస్పీ కాలువకి బి.యన్ రెడ్డి పేరు పెడతామని ప్రకటించిన విషయం ప్రజలు మర్చిపోలేదని వెంకన్న గుర్తు చేశారు

గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో అనేకసార్లు ఉమ్మడి జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి కి తుంగతుర్తి ఎమ్మెల్యే కిషోర్ కి కాలువకు భీమిరెడ్డి పేరు పెట్టాలని వినతిపత్రాలు ఇవ్వటం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు బి.యన్.రెడ్డి వర్ధంతి సభలో హాజరై అసెంబ్లీలో చర్చించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి శ్రీరామ్ సాగర్ రెండవ కాలువకు భీమిరెడ్డి పేరు పెట్టిస్తానని హామీ ఇచ్చారని వెంకన్న తెలిపారు

రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి దినకర్మలకు వచ్చిన ముఖ్యమంత్రి తొందరపడి కాలువకు దామోదర్ రెడ్డి పేరు ప్రకటించారని పునర్ ఆలోచించి ఆ ప్రకటనను వెనక్కి తీసుకొని శ్రీరామ్ సాగర్ రెండవ దశ కాలువకు భీమిరెడ్డి నరసింహారెడ్డి పేరు నామకరణం చేయాలని ప్రభుత్వానికి వెంకన్న విజ్ఞప్తి చేశారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333