అందరూ అయోడిన్ కలిగిన ఉప్పు వాడాలి

Oct 21, 2025 - 19:43
 0  5
అందరూ అయోడిన్ కలిగిన ఉప్పు వాడాలి

 జిల్లావైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్కే సిద్ధప్ప.

 జోగులాంబ గద్వాల 21 అక్టోబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి :  గద్వాల గ్లోబల్ డెఫిషియన్సీ అయోడిన్ డిజార్డర్స్ ప్రివెన్షన్ డే.. అక్టోబర్" 21...సందర్భంగా జిల్లా సమీక్ష సమావేశం నందు MLHP సిబ్బందికి సూచనలు... పాల్గొన్న జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్లు జిల్లా వైద్య సిబ్బంది...

జోగులాంబ గద్వాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఈరోజు.. ఉదయం 10 గంటలకు...MLHP సిబ్బందికి..గ్లోబల్ డెఫిషియన్సీ అయోడిన్ డిజార్డర్స్ ప్రివెన్షన్ డే.. అక్టోబర్" 21.. సందర్భంగా డిఎంహెచ్వో డాక్టర్ ఎస్ కే సిద్ధప్ప  మాట్లాడుతూ... అయోడిన్ లోపం వల్ల కలిగే సమస్యలు గ్రామాలలో అందరికీ వివరించాలని  అయోడిన్ ఉప్పు  వాడడం వలన లాభాలు తెలుపాలని సూచించారు... వాడకపోయినచో 
గొయిటర్ (మెడ ఉబ్బరం) మానసిక మందగమనము (బుద్ధి తగ్గిపోవడం) బలహీనత, అలసట గర్భిణీ స్త్రీలలో మృతశిశువు జననం లేదా పిల్లల్లో వికలాంగతఅయోడిన్... కలిగి ఉంటారని తెలిపారు... మరియు వాడడం వలన ప్రయోజనాలు తెలుపుతూ....

✅ మెదడు అభివృద్ధికి అవసరమని 
✅ శారీరక ఎదుగుదలకు తోడ్పడుతుందని 
✅ రోగనిరోధక శక్తిని పెంచుతుందని 
✅ గర్భిణీ స్త్రీలు మరియు పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుతుందని ప్రజలకు అందరికీ విస్తృతంగా ప్రచారం చేయాలని ఈ సందర్భంగా  జాగ్రత్తలు కూడా తెలిపారు ముఖ్యగా.... 
1. ఎప్పుడూ అయోడిన్ కలిగిన ప్యాక్ ఉప్పు (15 ppm) మాత్రమే వాడండి.
2. ఉప్పు ప్యాకెట్‌పై “Iodized Salt” అని ఉన్నదో చూడండి.
3. ఉప్పును కప్పి పెట్టండి – తడి లేదా సూర్యరశ్మిలో ఉంచకండి.
4. వంట చివరిలో ఉప్పు వేయడం ద్వారా అయోడిన్ నిల్వ ఉంటుంది.
ఇట్టి సమీక్ష సమావేశంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ జె సంధ్యా కిరణ్ మై, డాక్టర్ ప్రసూన రాణి, డాక్టర్ జి రాజు, డాక్టర్ రిజ్వానా తనివిర్, డిపిహెచ్ఎన్ఓ వరలక్ష్మి, ఇన్సిడి జిల్లా కోఆర్డినేటర్ శ్యాంసుందర్  శ్యాం సుందర్, డిడిఎమ్ రామాంజనేయులు, అందరూ పాల్గొన్నారు...

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333