జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యా వాలంటీర్లను నియమించాలి

Oct 21, 2025 - 19:41
 0  17
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యా వాలంటీర్లను నియమించాలి

BRSV రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య

 జోగులాంబ గద్వాల 21 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల జిల్లా కేంద్రం లో జిల్లా డీఈవో కి బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో వినతి పత్రంను అందజేసిన బీఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య

 ఈ సందర్బంగా బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కురువ పల్లయ్య మాట్లాడుతూ...  జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత చాలా తీవ్రంగా ఉన్నది.  ముఖ్యంగా జడ్.పి.హెచ్.ఎస్ లాంటి స్కూల్లో సబ్జెక్టుల టీచర్స్ లేకపోవడం వల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందే పరిస్థితి లేదు.  విద్యార్థులు తక్కువ ఉన్నచోట టీచర్లను డబుల్ ప్యాటర్న్ ఉన్న దగ్గరికి సర్దుబాటు చేయాలని తెలిపారు.  అదేవిధంగా విద్య వాలంటర్లను కూడా నియమించాలని వారు కోరారు.  స్కూలను జిల్లాలోని ఎంఈఓ లు స్కూలను విజిట్ చేయలేకపోవడం స్కూళ్లపైన పర్యవేక్షణ తగ్గింది తక్షణమే ఎంఈఓ లు ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లను విసిట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అదేవిధంగా జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు లేకున్నా కూడా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. ఫీజుల నియంత్రణ చట్టంను అమలు చేయాలని కోరారు. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక క్లాసులు పెట్టి జిల్లాలో పాస్ పర్సంటేజ్ పెంచే విధంగా మరియు నాణ్యమైన విద్యను అందించే విధంగా కృషి చేయాలని డీఈవో కి విన్నవించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాధవ్, చిన్నారి రంగస్వామి నరసింహ తదితరులు పాల్గొన్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333